Lakshmi Parvathi : కాకినాడ జిల్లా పిఠాపురం ఎస్సార్ కళ్యాణ మండపంలో వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సామాజిక వర్గాల సమన్యాయమే వైసీపీ ధ్యేయమన్నారు. అబద్ధం ముందు పుట్టి చంద్రబాబు తర్వాత పుట్టాడన్నారు.
పూర్తిగా చదవండి..Also Read: వారేవా.. వాలీబాల్ ఆట ఆదరగొట్టిన నారా బ్రహ్మణి.. వీడియో వైరల్..!
చంద్రబాబుకు కేరాఫ్ అడ్రస్ అంటే గుర్తుకు వచ్చేది వెన్నుపోటు, కుట్రలు, కుతంత్రాలు, మోసం, దగా అని దుయ్యబట్టారు. పిల్లనిచ్చిన మామకే వెన్ను పోటు పొడిచిన దుర్మార్గుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గురించి స్పందించారు. ఆయన చాలా మంచి వ్యక్తి అని.. అయితే, అలాంటి వ్యక్తి ఒక దుర్మార్గుడిని నమ్మి మోసపోతున్నాడు అన్న విషయం తెలుసుకోలేకపోతున్నాడన్నారు.
Also Read: నన్ను చంపేందుకు తమ్మినేని సీతారాం స్కెచ్ వేశారు.. టీడీపీ అభ్యర్థి భార్య సంచలన వ్యాఖ్యలు..!
కాపులంతా ఒక్కసారి ఆలోచించాలని.. కాపు ఆడపడుచును గీతను గెలిపించాలని కోరారు. వైసీపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీలో ఉన్న వంగా గీతకు నియోజకవర్గంలో ఉన్న కాపులంతా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి వలస వచ్చి వెళ్లిపోయే సినిమా నటులకు ఓటు వేసి వృధా చేసుకోరాదని సూచించారు. జనసేన తరఫును పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండరన్నారు. అటువంటి వ్యక్తికి ఓటు వెయ్యడం వల్ల ఉపయోగం ఉండదని.. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేవారికి ఓటు వేయండని కోరారు.
[vuukle]