Kodi Kathi : వైసీపీ(YCP) అధినేత జగన్(YS Jagan) పై కోడికత్తితో దాడి చేసిన కేసులో అరెస్టై విడుదలైన శ్రీనుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు టీడీపీ(TDP) లో చేరారు. ముమ్మిడివరం టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో కోడికత్తి శ్రీను(Kodi Kathi Srinivas) కుటుంబ సభ్యులు టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీలోకి శ్రీనుతండ్రి, అన్న సుబ్బరాజు, ఇతర కుటుంబ సభ్యులు చేరారు. ఈ సందర్భంగా కోడికత్తి కేసుపై శ్రీను అన్న సుబ్బరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. చేయని నేరానికి తన తమ్ముడు ఆరేళ్ల జైలు జీవితం గడిపాడని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ వల్లే శ్రీను బయటకు వచ్చాడన్నారు.
జగన్ సీఎం కావడం కోసం..: శ్రీను
శ్రీను మాట్లాడుతూ.. ఈ అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) ల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించానన్నారు. కానీ, పరిస్థితులు అనుకూలించక టీడీపీలో చేరానన్నారు. జగన్ సీఎం కావడం కోసం చేసిన ప్రయత్నం కారణంగా తాను ఐదేళ్లు జైల్లో మగ్గానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అన్ని పార్టీల మద్దతు లభించినా.. వైసీపీ నేతలు మాత్రం పట్టించుకోలేదన్నారు. ఎస్సీ సంఘాలు, ప్రతిపక్షాల కారణంగానే తాను బతికి ఉన్నానన్నారు. తన విడుదలకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు కోడికత్తి శ్రీను.
Also Read : వైసీపీ మేనిఫెస్టో పై సుగుణమ్మ రియాక్షన్..!
కోడికత్తి కేసు ఏంటి?
2018 అక్టోబర్ 25న వైజాగ్ ఎయిర్పోర్టులో కోడికత్తితో దాడి జరిగింది. కత్తి జగన్ భుజానికి గుచ్చుకుంది. ఈ కేసులో శ్రీనును నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి శ్రీను దాదాపు ఐదేళ్ల పాటు జైలులో ఉన్నారు. ఈ ఫిబ్రవరిలో ఆయనకు బెయిల్ లభించడంతో విడుదలయ్యారు.