AP Elections 2024 : నామినేషన్ అనంతరం సొంత గడ్డ పులివెందుల(Pulivendula) లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్(CM YS Jagan) కీలక వాఖ్యలు చేశారు. వివేకాను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో.. జిల్లాలో అందరికీ తెలుసన్నారు. వివేకా(YS Viveka) ను చంపిన హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారన్నారు. వివేకాను ఓడించిన వారితోనే తమపై ఆరోపణలు చేస్తున్న వారు చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారంటే అర్థమేంటి? అని ప్రశ్నించారు.
చిన్నాన్న వివేకాకు రెండో పెళ్లి అయింది వాస్తవం.. సంతానం ఉన్నది వాస్తవమన్నారు. వైఎస్ అవినాష్(YS Avinash) ఏ తప్పూ చేయలేదన్నారు. అందుకు ఆయనకు టికెట్ ఇచ్చానన్నారు. వైఎస్ అవినాష్‌ను కొందరు తెర మరుగు చేయాలని, ఆయన జీవితాన్ని నాశనం చేయాలని చూశారని ఆరోపించారు. చిన్న పిల్లోడి మీద కుట్రలు పన్నారన్నారు. జగన్ ఫుల్ స్పీచ్ ను ఈ వీడియోలో చూడండి.