YS Jagan : వివేకా చిన్నాన్నకు రెండో పెళ్లి.. పులివెందుల లో జగన్ షాకింగ్ కామెంట్స్- VIDEO ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన మీటింగ్ లో జగన్ మాట్లాడుతూ.. వివేకాకు రెండో పెళ్లి జరిగింది.. సంతానం ఉన్నది వాస్తవమన్నారు. అవినాష్ ఏ తప్పూ చేయలేదు కాబట్టే మళ్లీ టికెట్ ఇచ్చానన్నారు. By Nikhil 25 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి AP Elections 2024 : నామినేషన్ అనంతరం సొంత గడ్డ పులివెందుల(Pulivendula) లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్(CM YS Jagan) కీలక వాఖ్యలు చేశారు. వివేకాను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో.. జిల్లాలో అందరికీ తెలుసన్నారు. వివేకా(YS Viveka) ను చంపిన హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారన్నారు. వివేకాను ఓడించిన వారితోనే తమపై ఆరోపణలు చేస్తున్న వారు చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారంటే అర్థమేంటి? అని ప్రశ్నించారు. చిన్నాన్న వివేకాకు రెండో పెళ్లి అయింది వాస్తవం.. సంతానం ఉన్నది వాస్తవమన్నారు. వైఎస్ అవినాష్(YS Avinash) ఏ తప్పూ చేయలేదన్నారు. అందుకు ఆయనకు టికెట్ ఇచ్చానన్నారు. వైఎస్ అవినాష్‌ను కొందరు తెర మరుగు చేయాలని, ఆయన జీవితాన్ని నాశనం చేయాలని చూశారని ఆరోపించారు. చిన్న పిల్లోడి మీద కుట్రలు పన్నారన్నారు. జగన్ ఫుల్ స్పీచ్ ను ఈ వీడియోలో చూడండి. #ys-viveka-murder-case #pulivendula #ap-cm-ys-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి