/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Pitapuram-.jpg)
వైసీపీ అధినేత పవన్ కల్యాణ్ పోటీలో ఉన్న పిఠాపురంలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ వేళ.. పలువురు వ్యక్తులు ఓటర్ స్లిప్పులతో జంప్ కావడం చర్చనీయాంశమైంది. డబ్బులు ఇస్తామని ఆశచూపి ఓటర్ స్లిప్పులను వైసీపీ కార్యకర్తలు ఎత్తుకెళ్లారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. దాదాపు 400 నుంచి 500 మంది దగ్గర ఓటర్ స్లిప్పులను తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు చెబుతున్నారు. ఓటర్ స్లిప్పులు పట్టుకెళ్లిన వ్యక్తులు రాకపోవడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి 12 వరకు ఎదురు చూసి విసుగెత్తి పలువురు వైసీపీ నేతల ఇళ్లపై కొందరు ఓటర్లు దాడి చేశారు. మా స్లిప్పులు మీ దగ్గర ఎందుకు ఉంచుకున్నారని ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఉదయం ఓటు వేసే సమయానికి మీకు మీ స్లిప్పులు ఇప్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన చేస్తున్న వారు వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది.