Sardar Beg : గుడివాడ (Gudivada) లో వైసీపీ (YCP) మైనార్టీ నేత సర్దార్ బేగ్ విడుదల చేసిన వీడియో కలకలం సృష్టిస్తోంది. పోలింగ్ (Polling) రోజు కొడాలి నాని (Kodali Nani) డబ్బులు ఇస్తే చాలా మంది పంచకుండా నొక్కేశారని ఆయన ఆ వీడియోలో ఆరోపించారు. కష్టపడిన తమలాంటి వాళ్లకు కనీసం తిండి కూడా పెట్టలేదని ఆయన ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్లకు డబ్బులు ఇవ్వని వాళ్లను పిలిపించాలని ఆయన కోరారు. వాళ్ల దగ్గర డబ్బులు వసూలు చేయాలని కోరారు.
ఆ డబ్బులు నొక్కేసిన వారు సింగపూర్, మలేషియా పారిపోయేందుకు రెడీగా ఉన్నారని ఆరోపించారు. మాట వినని వారిపై కుక్కలను వదిలేయాలంటూ ఆయన మాట్లాడిన వీడియో రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. దీనిపై కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే.. కొడాలి నాని ఎన్ని డబ్బులు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? వారు నిజంగానే పంచకుండా నొక్కేశారా? అసలేం జరిగింది? అన్న చర్చ గుడివాడలో జోరుగా సాగుతోంది.
Also Read : ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత