ఏపీలో ఎన్నికల సందర్భంగా అల్లర్లు సృష్టించిన నిందితులను రెండ్రోజుల్లో అరెస్ట్ చేస్తామని సీఈఓ ఆర్కే మీనా ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తామన్నారు. ప్రస్తుతం 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ కొనసాగుతోందన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పార్టీలకు చెందిన ప్రతినిధి 24 గంటలు ఉండవచ్చన్నారు.
ఏపీలో 81.86% పోలింగ్: సీఈఓ ప్రెస్ మీట్-LIVE
ఏపీలో మొత్తం 81.86 శాతం పోలింగ్ నమోదైందని సీఈఓ ప్రకటించారు. మొత్తం 350 స్ట్రాంగ్ రూమ్ లలో ఈవీఎంలను భద్రపరిచామన్నారు. దర్శిలో అత్యధికంగా 90.91, తిరుపతిలో అత్యల్పంగా 63 శాతం ఓటింగ్ నమోదైందన్నారు. సీఈవో ప్రెస్ మీట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
New Update
Advertisment