AP: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ విడుదల.. వారికి నో ఛాన్స్!

ఎట్టకేలకు ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ ను ఆ పార్టీ విడుదల చేసింది. పొత్తుల్లో భాగంగా కేటాయించిన పది స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ధర్మవరం అభ్యర్థిని కూడా బీజేపీ ప్రకటించడంతో అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన పరిటాల శ్రీరామ్ కు నిరాశే మిగిలింది.

New Update
AP: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ విడుదల.. వారికి నో ఛాన్స్!

AP BJP MLA Candidates List: ఏపీలో బీజేపీ (BJP) ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ ను ఆ పార్టీ విడుదల చేసింది. మొత్తం 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి పది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కాగా.. మరో సీటు కోసం ఆ పార్టీ ప్రయత్నిస్తోందన్న వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు పది మంది అభ్యర్థులతో లిస్ట్ విడుదల చేయడంతో.. పదకొండో సీటు విషయంలో బీజేపీ వెనక్కు తగ్గినట్లు స్పష్టం అవుతోంది. ధర్మవరం సీటుకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించడంతో ఇప్పుడు టీడీపీ నుంచి టికెట్ ఆశించిన పరిటాల శ్రీరామ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తిగా మారింది. ఎచ్చెర్ల లోనూ అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ మంత్రి కళా వెంకట్రావు నెక్ట్స్ స్టెప్ ఏంటనే అంశంపై చర్చ మొదలైంది.
ఇది కూడా చదవండి: YS Jagan : గెలుపే లక్ష్యం.. ఆ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించిన జగన్!

బీజేపీ అభ్యర్థుల లిస్ట్..
1. ఎచ్చెర్ల-ఈశ్వర రావు
2. విశాఖ నార్త్-విష్ణు కుమార్ రాజు
3.అరకు-రాజారావు
4.అనపర్తి-శివ కృష్ణం రాజు
5.విజయవాడ వెస్ట్-సుజనా చౌదరి

6.బద్వేల్-బొజ్జ రోషన్న
7.జమ్మలమడుగు-ఆదినారాయణ రెడ్డి
8.ఆదోని-పీవీ.పార్ధసారధి
9.ధర్మవరం-వై.సత్య కుమార్
10.కైకలూరు-కామినేని శ్రీనివాసరావు

వారికి షాక్..
ధర్మవరం సీటు ఆశించిన వరదాపురం సూరికి బీజేపీ షాకిచ్చింది. అక్కడి నుంచి సత్యకుమార్‌కు అవకాశం కల్పించింది. మరో సీనియర్ నేత సోము వీర్రాజుకు కూడా టికెట్ దక్కలేదు. ఇంకా విజయవాడ వెస్ట్ సీటును బీజేపీ తీసుకుంది. ఈ సీటును జనసేన నుంచి పోతిన మహేశ్ ఆశించారు. కొద్దిసేపటి క్రితమే పవన్‌ను కలిశారు పోతిన. తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. దీంతో.. ఆయన ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

AP BJP MLA Candidates List AP BJP MLA Candidates List

Advertisment
Advertisment
తాజా కథనాలు