AP Elections 2024: నామినేషన్ల వేళ.. కృష్ణా జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ కృష్ణా జిల్లా నూజివీడులో టీడీపీకి షాక్ ఇచ్చేందుకు సొంత పార్టీ నేత సిద్ధమయ్యారు. టికెట్ దక్కకపోవడంతో ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అయ్యారు. రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. By Nikhil 17 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి మరికొద్ది గంటల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం కానున్న వేళ కృష్ణా జిల్లా నూజివీడు టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీపై ముద్రబోయిన వెంకటేశ్వర రావు తిరుగుబాటు చేశారు. రేపు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. 2014,19 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ముద్రబోయిన. అయితే ఈ సారి కొలుసు పార్థసారథికి టీడీపీ నూజివీడు టికెట్ కేటాయించారు. ఇది కూడా చదవండి: AP Politics: నామినేషన్లకు కొన్ని గంటల ముందు టీడీపీలో బిగ్ ట్విస్ట్.. ఆ అభ్యర్థి మార్పు? పార్థసారథికి టికెట్ ఇవ్వడంపై ముద్రబోయిన తీవ్ర అసంతృప్తిగా ఉంది. చంద్రబాబు పిలిచి మాట్లాడినప్పటికీ ముద్రబోయిన వెనక్కి తగ్గలేదు. నూజివీడు సిట్టింగ్ ఎమ్మెల్యేతో కలిసి ఇటీవల జగన్‌ను కలిశారు ముద్రబోయిన. దీంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం సాగింది. అయితే, అనూహ్యంగా ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధం అవడం జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి