Chandrababu EC Notice : చంద్రబాబుకు ఈసీ నోటిసులు.. 24 గంటలు డెడ్‌లైన్!

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సోషల్ మీడియా వింగ్‌ అభ్యంతరకర పోస్టులు పెట్టినట్టు సమాచారం.దీనిపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ కంప్లైంట్‌ చేశారు. ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా చంద్రబాబుకి నోటీసులు జారీ చేశారు. 24గంటల్లో పోస్టులు డిలీట్ చేయాలని ఆదేశించారు.

New Update
Chandrababu: జగన్‌ను దెబ్బకొట్టేలా చంద్రబాబు పర్యటనలు

EC Notice : ఎన్నికల కోడ్‌(Election Code) అమల్లోకి వచ్చిందో లేదో ఎలక్షన్‌ కమిషన్‌(Election Commission) దూకుడు పెంచింది. నిబంధనలు ఉల్లంఘించినవారికి నోటిసులు పంపుతోంది. చిన్న పెద్దా లీడర్లని తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) కు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఏపీ సీఎం జగన్‌(CM Jagan) పై టీడీపీ సోషల్ మీడియా(Social Media) వింగ్‌ అభ్యంతరకర పోస్టులు పెట్టినట్టు సమాచారం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటోంది వైసీపీ.

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ కంప్లైంట్‌ చేశారు. ఫిర్యాదుపై సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా స్పందించారు. చంద్రబాబుకి నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా జగన్‌పై సోషల్‌మీడియాలో పెట్టిన అసభ్య పోస్టులు తొలగించాలని సీఈవో ఆదేశించారు. ఈ పోస్టులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు.

మోదీపై ఈసీకి ఫిర్యాదు:
మరోవైపు ప్రధాని మోదీ(PM Modi) పై ఏపీ ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు అందింది. ఏపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు భారత్‌ వైమానిక దళ హెలికాఫ్టర్‌ను ఉపయోగించిన మోదీపై టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ఫిర్యాదు చేశారు. ఆదివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) ర్యాలీలో మోదీ ప్రసంగించడాన్ని గోఖలే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారికి రాసిన లేఖలో ప్రస్తావించారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 5236 టెయిల్ నంబర్ గల ఐఏఎఫ్ హెలికాప్టర్ లో ప్రధాని ర్యాలీ వేదిక వద్దకు చేరుకున్నారని గోఖలే చెప్పారు.

Also Read : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఆ కీలక బాధ్యతలు.. కన్ఫామ్‌ చేసిన కేసీఆర్‌!

Advertisment
తాజా కథనాలు