AP EAMCET: విద్యార్థులకు అలెర్ట్.. ఏపీ ఎంసెట్ కొత్త షెడ్యూల్ ఓ లుక్కేయండి..! By Trinath 09 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP EAMCET నుంచి కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈఏపీసెట్ (ఇంజినీరింగ్) అడ్మిషన్ల ప్రక్రియలో ఆప్షన్ల ఎంపికకు గడువును పొడిగించారు వెబ్ అప్షన్స్ కోసం విండో ఓపెన్ అయ్యింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం, ఆప్షన్ ఎంట్రీ లింక్ ఆగస్ట్ 7 నుంచి ఆగస్టు 14 వరకు యాక్టివేట్‌గా ఉంటుంది. అభ్యర్థులు ఆప్షన్‌లను మార్చుకునే ఛాన్స్ ఆగస్టు 16 వరకు ఉంటుంది. సీట్ల కేటాయింపు రిజల్ట్ ఆగస్టు 23న ప్రకటిస్తారు. సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్ ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు ఉంటుంది. క్లాసులు ఆగస్టు 31 నుంచి ప్రారంభమవుతుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ, సీట్ల కేటాయింపు, కాలేజీలో రిపోర్టింగ్ ఉంటాయి. AP EAMCET 2023 కౌన్సెలింగ్ ప్రక్రియలో కొత్త షెడ్యూల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ కింద స్టెప్స్‌ని ఫాలో అవ్వండి. https://eapcet-sche.aptonline.in/EAPCET/ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి “APEAPCET-2023 అడ్మిషన్స్ రివైజ్డ్ షెడ్యూల్” లింక్‌పై క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు PDFకి యాక్సెస్ వస్తుంది వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి? • ముందు అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి, హోమ్‌పేజీలో ‘AP EAMCET వెబ్ ఆప్షన్స్’ ఫారమ్‌పై క్లిక్ చేయండి. • దీంతో కొత్త లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ AP EAMCET 2023 అడ్మిట్ కార్డ్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయాలి. • తర్వాత వెబ్ ఆప్షన్ విండో ఓపెన్ అవుతుంది. మీ ప్రాధాన్యత ప్రకారం ఆప్షన్స్ ఇచ్చి, ఫారమ్‌ను సేవ్ చేయండి. • అభ్యర్థుల ప్రిఫరెన్స్ ప్రకారం సీటు కేటాయిస్తారు. ఆ తర్వాత పేర్కొన్న తేదీల్లో, అడ్మిషన్ వచ్చిన కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈఏపీసెట్ (ఇంజినీరింగ్) కౌన్సెలింగ్ ప్రక్రియను ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తోంది. ఈఏపీసెట్ (ఇంజినీరింగ్) 2023 కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు, సీట్ల లభ్యత ఆధారంగా జరుగుతుంది. సీట్లు కేటాయించిన అభ్యర్థులు చివరకుగా అడ్మిషన్ కోసం కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈఏపీసెట్‌కు 1.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు సగం మందికి పైగా ఆప్షన్లు పెట్టుకున్నారు. మిగిలిన వారి కోసం వెబ్ ఆప్సన్ విండో ఆగస్టు 14వరకు ఉంటుంది. #eamcet #ap-eamcet #eamcet-web-options మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి