BREAKING: ఏపీలో డీఎస్సీ షెడ్యూల్‌ సస్పెండ్.. జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. !

మార్చి 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్‌ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. టెట్ , డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్టు ఆదేశించింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14న రిలీజ్ కానుండగా మార్చి 15 నుంచి డీఎస్సీ ఎగ్జామ్‌ పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

Breaking: ఏపీ మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం.. జూలై ఒకటి నుంచి ప్రక్రియ మొదలు..!
New Update

AP DSC Schedule Suspended: జగన్‌ సర్కార్‌కు ఏపీ హైకోర్టులో షాక్‌ తగిలింది. టెట్ , డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్ట్ తీర్పునిచ్చింది. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చ్ 14న రిలీజ్ కానున్నాయి. మార్చ్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్టులో పలువురు విద్యార్థులు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై లాయర్‌ శరత్ చంద్ర వాదనలు వినిపించారు. కేవలం ఒక్క రోజు సమయంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎప్పుడు అలాంటి షెడ్యూల్ ఇవ్వలేదని వాదించారు. నిరుద్యోగుల హక్కులను హరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

పిటిషన్లు తరపున న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుapకున్న హైకోర్టు.. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్‌ను సస్పెండ్ చేసింది. టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు కు నాలుగు వారాలు కనీసం సమయం ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం తిరిగి డీఎస్సీ నిర్వహణకు నెల రోజుల వ్యవధితో మరో షెడ్యూల్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం టెట్ పరీక్షలు ముగిసిన మార్చి 14 నుంచి నెల రోజుల గడువు అంటే ఏప్రిల్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలకు తాజా షెడ్యూల్ విడుదల చేయనుంది. ఏపీలో 6100 టీచర్ పోస్టుల భర్తీ కోసం ఏపీ ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 2018 ప్రకారమే పరీక్షల సిలబస్ ఉంటుందని మంత్రి బొత్స ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితి 44 ఏళ్ళు… ఎస్సీ, ఎస్టీ, బీసీ(SC, ST, BC) లకు అదనంగా మరో ఐదేళ్ళ సడలింపు ఉంటుంది. దీంతో పాటు 1,264 టీజీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులకు కూడా నోటిపికేషన్ విడుదల చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలోపే అన్ని నియామకాలను పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

Also Read: ఖమ్మం లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామానాగేశ్వరరావు!

#ap-high-court #ap-dsc
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe