/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/AP-DGP-Harish-Kumar.jpg)
AP DGP Harish Kumar:కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ నివేదిక పంపారు. పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పిన్నెల్లి అరెస్ట్ కు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. అతన్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు.
పరారీలో వైసీపీ ఎమ్మెల్యే..
ఎన్నికల రోజు ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఎయిర్‌పోర్ట్‌లను అప్రమత్తం చేశారు. మరో వైపు లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు. ప్రత్యేక పోలీస్ బృందాలు పిన్నెల్లి సోదరుల కోసం పోలీస్ బృందాల గాలింపు చేపట్టినట్లు సమాచారం. మొత్తం 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
పిన్నెల్లిపై పీడీపీపీ చట్టం కింద మరో కేసు నమోదైంది. ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ఈ నెల 20నే పిన్నెల్లిపై కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల కింద నేరం రుజువు అయితే రామకృష్ణారెడ్డికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆయన ఎన్నికల్లో గెలిచినా డిస్‌క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉందని వారు అంటున్నారు.