షర్మిల ధర్నా .. విజయవాడలో హై టెన్షన్.. లైవ్ అమరావతి ఆదాయ పన్ను కార్యాలయం వైఎస్ షర్మిల ఎదుట ధర్నా చేస్తున్నారు. దేశంలోని అన్ని వ్యవస్థలను బీజేపీ బ్రష్టు పట్టిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని బీజేపీ బెదిరించలేదన్నారు. By Nikhil 30 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి దేశంలో భారత రాజ్యాంగం నడవడం లేదని, బీజేపీ రాజ్యంగం నడుస్తోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీని ఆదాయపన్ను శాఖతో పాటు ఇతర సంస్థలు వేధిస్తున్నాయని ఆరోపించారు. ఈ రోజు అమరావతిలోని ఇన్ కం ట్యాక్స్ కార్యాలయం ఎదుట షర్మిల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు, ఆ పార్టీ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండకూడదన్నది బీజేపీ సర్కార్ కుట్ర అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీకి ఎందుకు భయం అని ప్రశ్నించారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఏపీ కి ఎం చేయకపోయినా చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అధికారులు బీజేపీ తొత్తులుగా పని చేస్తున్నారని ఆరోపించారు. జగన్, చంద్రబాబు బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి