Jagan: లండన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్

ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకోసం అనుమతి కోరుతూ తెలంగాణలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్.. దేశం విడిచి వెళ్లరాదనే బెయిల్ షరతులు ఉన్నాయి. అయితే ఆ షరతలను సడలించిన అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.

New Update
రేపు, ఎల్లుండి సీఎం జగన్ షెడ్యూల్ ఇదే..!

ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకోసం అనుమతి కోరుతూ తెలంగాణలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్.. దేశం విడిచి వెళ్లరాదనే బెయిల్ షరతులు ఉన్నాయి. అయితే ఆ షరతలను సడలించిన అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. అయితే జగన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి సీబీఐ సమయం కోరింది. దీంతో ఈనెల 30కి విచారణను వాయిదా వేసింది కోర్టు. లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తె వద్దకు సెప్టెంబర్ 2న వెళ్లడం కోసమే జగన్ అనుమతి కోరినట్లు తెలుస్తోంది.

మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విదేశీ పర్యటన కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ షరతులు సడలించాలని కోరుతూ పిటిషన్‌లో పేర్కొన్నారు. యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, అమెరికా, జర్మనీ, దుబాయ్ సింగపూర్ పర్యటనలకు వెళ్లడం కోసం ఆయన అనుమతి కోరారు. అయితే ఈ పిటిషన్‌పైనా కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ..

ఇక కోడికత్తి కేసు విచారణ నేడు విశాఖలోని ఎన్‌ఐఏ కోర్టులో జరగనుంది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో కోడికత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై నాలుగేళ్లుగా విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరుగుతూ వస్తోంది. అయితే విశాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ ఈ కేసు విచారణను బదిలీ చేశారు. విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టుతో పాటు విశాఖపట్నంలోనూ మరో కోర్టును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. విశాఖలోని మూడో అదనపు జిల్లా కోర్టు, ఎస్‌పీఈ, ఏసీబీ కేసులు చూసే కోర్టుకు ఎన్‌ఐఏ కేసుల విచారణ బాధ్యతలు అప్పగించారు. విజయవాడ కోర్టులో గతంలో జరిగిన విచారణ సందర్భంగా ఈ కేసులో కుట్ర కోణంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని జగన్‌ తరఫు న్యాయవాది పిటిషన్‌ను ఎన్‌ఐఏ కోర్టు కొట్టివేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు