Jagan delhi tour: సీఎం జగన్(Jagan) ఢిల్లీ టూర్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర పెద్దలతో వరుస పెట్టి భేటీ అవుతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala sitharaman)తో సీఎం జగన్ ఇప్పటికే ముగిసింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించారు. పోలవరం(Polavaram) నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి(Mithun reddy), సీఎస్ జవహర్‌రెడ్డి ఉన్నారు. ఇక నిర్మలాతో మీటింగ్ తర్వాత సీఎం కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను కలిశారు. ఇక రేపు(అక్టోబర్ 6) వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరుగుతున్న సదస్సులో పాల్గొననున్నారు జగన్. రేపు(అక్టోబర్ 5) రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు.
చంద్రబాబు అరెస్ట్ సమయంలోనే భేటీ:
ఓవైపు చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు గత నెల 9న అరెస్ట్ అయ్యారు. ఇప్పటికీ రాజమండ్రీ సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. ఈ నెల 19వరకు రిమాండ్‌ని పొడిగించింది ఏసీబీ కోర్టు. ఓవైపు కేంద్ర పెద్దలను కలిసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. నిన్నటివరకు ఎన్డీఏలో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇక కూటమికి గుడ్‌బై చెప్పారు. ఇటు జగన్ మాత్రం కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. పార్లమెంట్‌లో ట్రెడిషినల్‌గానే వైసీపీ ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. కేంద్రాన్ని వైసీపీ పెద్దగా విమర్శించదు.. అటు కేంద్ర పెద్దలు కూడా అలానే ఉంటారు. వచ్చే ఏడాది జనరల్ ఎలక్షన్స్ ఎన్డీఏకి చాలా కీలకం. బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఈ సారి మిత్ర పక్షాల అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీతో కేంద్రం ఫ్రెండ్లిగా ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
యాంటీ లెఫ్ట్ వింగ్ మీటింగ్‌కి జగన్:
వామపక్ష తీవ్రవాదంపై ఢిల్లీలో జరిగే సమావేశానికి జగన్ హాజరు కానుండడం ఆసక్తిని రేపుతోంది. శుక్రవారం విజ్ఞాన్ భవన్ లో వామపక్ష తీవ్రవాదంపై జరిగే సమావేశంలో పాల్గొంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇక రాష్ట్ర విభజన, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు, వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మాణం, కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్థిక సాయం సహా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2022 డిసెంబర్లో మోదీని కలిసిన జగన్ రాష్ట్ర డిమాండ్లను ప్రస్తావించారని, రాష్ట్ర విభజన తర్వాత ఎనిమిదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ ఏడాది మార్చి, జూలైలల్లో ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులను కలిశారు. అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశాఖపట్నం, తిరుపతిలో వేర్వేరు బహిరంగ సభల్లో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన నెల రోజుల తర్వాత ఆయన జూలైలో కేంద్ర హోంమంత్రిని కలిశారు.
ALSO READ: సీట్లపై కాకి రెట్టలు.. ఫ్యాన్స్‌కి ఒళ్లు మండేలా చేసిన బీసీసీఐ.. ఫస్ట్ మ్యాచ్ తుస్సు!