Pawan kalyan: జగన్‌ సంగతి ఢిల్లీలోనే తేలుస్తా..పవన్‌ మాస్ వార్నింగ్‌..!

తెలుగుదేశానికి బలం ఉంది.. జనసేనకు పోరాటపటిమ ఉంది.. వైసీపీ పార్టీని కూడా తక్కువ అంచనా వేయకండంటూ తనదైన స్టైల్‌లో మార్క్‌ డైలాగులు పేల్చారు పవన్‌ కల్యాణ్. పొత్తుల కోసం తాను తహతహలాడనని తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు జనసేన అధినేత. త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలకు రాష్ట్రలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తానని చెప్పారు. ప్రధాని, టీడీపీ సపోర్ట్‌తో మనం ముందుకు వెళ్లాటాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు.

New Update
Pawan kalyan:  జగన్‌ సంగతి ఢిల్లీలోనే తేలుస్తా..పవన్‌ మాస్ వార్నింగ్‌..!

త్వరలోనే ఢిల్లీ వెళ్లి నడ్డా, అమిత్‌షాను కలిసి ఏపీలోని పరిణామాలను వివరిస్తానన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. వచ్చే ఏడాది ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటి చేస్తామని పవన్‌ ప్రకటించిన తర్వాత జనసేన అధినేత తొలిసారి తమ పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. పొత్తు నిర్ణయం ప్రకటించాక ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు పవన్‌. అటు ఏపీ సీఎం జగన్‌ టార్గెట్‌గా పవన్‌ ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని మండిపడ్డారు.

పవన్‌ హాట్ కామెంట్స్:

➼ రాష్ట్రం కోసం బలంగా నిలబడతాం

➼ ప్రభుత్వ అధికారులు ఆలోచన చేయండి.. మీరు చేసేది కరెక్టేనా?

➼ రాజ్యాంగంపై ప్రమాణం చేసి కులాన్ని మోస్తున్నారు

➼ కులాలు, పార్టీలకు కొమ్ముకాయడానికి సిగ్గుండాలి

➼ పార్లమెంట్‌లోనూ జనసేన అడుగుపెడుతోంది

➼ సీఎం తనను తాను ఎక్కువ ఊహించుకుంటున్నారు

➼ ప్రజాగ్రహం చూస్తే జగన్ తట్టుకోలేడు

➼ చంద్రబాబు లాంటి వ్యక్తినే అరెస్ట్ చేశారు.. ప్రజల పరిస్థితి ఏంటి?

➼ అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఎలా?

➼ జగన్‌..జనాలను పీడిస్తున్నారు.. హింసిస్తున్నారు..

➼ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితికి జగనే కారణం

➼ ఎస్సీ, ఎస్టీ కేసులు, హత్యాయత్నం కేసులు అమాయకులపై పెడతారా

➼ వీటికి చరమగీతం పాడాలని బలంగా నిర్ణయం తీసుకున్నాం..

➼ వచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోలేకపోయాం

➼ పొత్తు నిర్ణయం ప్రకటించాక ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది

➼ త్వరలోనే ఢిల్లీ వెళ్లి నడ్డా, అమిత్‌షాను కలిసి ఏపీలోని పరిణామాలను వివరిస్తా

➼ త్వరలోనే ఢిల్లీ కులమా? రాజ్యాంగమా? పవన్‌

➼ అధికారులు కులాన్ని మోస్తున్నారు..

➼ అధికారిన్ని ఎలా పంచుకోవాలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

భారతీయుడిలా మాట్లాడతా:
పార్టీ పెట్టిన పదేళ్ళలో మీ అందరి మద్దతుతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నామన్నారు పవన్‌. కష్టాల్లో ఉన్నప్పుడే గుండె బలం తెలుస్తోందని.. ఒక్కడు ధైర్యంగా ఉంటే చాలు లక్షలాది మంది నిటారుగా నిలుచుంటారు అనేది నా నమ్మకమన్నారు. ఒక దుర్మార్గ పాలనను పదేళ్ళ పసిపిల్ల పార్టీ ఎలా ఎదుర్కొందో చూశారన్నారు. నాలుగు దశాబ్దాలు చరిత్ర ఉన్న పార్టీ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని.. అలాంటి మన పార్టీకి నాకు బలం మన రాజ్యాంగమన్నారు. ఇండియానా భారత్‌నా అనే అంశంపై ప్రజలకు శ్రద్ద పెరిగిపోయిందని.. నేను రకరకాలుగా మాట్లాడతానని చాలా మంది అంటారని.. నేను మాత్రం భారతీయుడిలా మాట్లాడతానని తెలిపారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలగటానికి అందరినీ కలుపుకుపోవటమే ముఖ్యమన్నారు. రాజ్యాంగంలోని కొన్ని పేజీలలోని ప్రత్యేకతలను వివరించారని.. నేను మాట్లాడేవి నేను సృష్టించినవి కాదు అందుకే రాజ్యాంగంలోని పేజీల గురించి వివరిస్తున్నానని తెలిపారు. నేను బతికుండగా జనసేన తరుపున నా వంతు కృషి ప్రజానీకానికి చేస్తానన్నారు

జగన్‌పై ఫైర్:
వైసీపీ ప్రభుత్వానికి దానికి కొమ్ముకాస్తున్న అధికార యంత్రాంగానికి కనువిప్పు కావాలనే నేను రాజ్యాంగాన్ని తీసుకువచ్చానని చెప్పారు పవన్‌. ప్రభుత్వ యంత్రాగానికి సిగ్గుండాలని.. రాజ్యాంగం మీద ప్రమాణం చేసే కదా వచ్చింది అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. అధికారులు తలలెత్తితే మేం నరికే వీరభధ్రులం అవుతామని.. నా ప్రశాంతతను చేతకానితనం అని అనుకోకండని విమర్శలు చేశారు. అధికారులు మీరు చేస్తున్నది మీకు సబబే అని అనిపిస్తుందా అని నిలదీశారు. మీరు కేసులు పెడితే బయపడతాం అనుకుంటున్నారా... మేం బయపడమని.. నువ్వెంత నీ బతుకెంత నీ స్తాయింత అంటూ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్‌.. 'నువ్వేమైనా దిగొచ్చావా జగన్' అని ఫైర్ అయ్యారు.

ALSO READ: జగన్‌ పెద్ద అవినీతి పరుడు.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు