ఈ రోజు కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో పని తీరుపై వారితో వివిధ అంశాలనపై చర్చించారు. పలు విషయాలను వారికి వివరించారు చంద్రబాబు. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్ లో ఉందని.. అది గ్రహించి మసలుకోవాలని సీఎం మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. HODలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై నెల నెలా సమీక్షలు చేపట్టాలని మంత్రులను చంద్రబాబు ఆదేశించారు.
తమ తమ శాఖలకు చెందిన పరిస్థితిని ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇంకా.. అధికారాన్ని తలకెక్కించుకోవద్దని మంత్రులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా సమన్వయంతో వెళ్లాలని సూచించారని తెలుస్తోంది.