Chandrababu: తెలంగాణలోనూ టీడీపీదే అధికారం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

భవిష్యత్ లో తెలంగాణలోనూ టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేపడతామన్నారు. మరో 15 రోజుల్లో సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామన్నారు. అనంతరం అధ్యక్షుడి నియామకం ఉంటుందన్నారు. ఈ రోజు తెలంగాణ నేతలతో బాబు సమావేశమయ్యారు.

Chandrababu: తెలంగాణలోనూ టీడీపీదే అధికారం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
New Update

Chandrababu Telangana Tour: ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెంచారు. ఇక్కడ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పార్టీ ముఖ్యనాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో తెలంగాణలోనూ టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో గ్రామ స్థాయి నుంచి పార్టీని నిర్మిస్తామన్నారు. 15 రోజుల్లో సభ్యత్వ నమోదు ప్రారంభిస్తానన్నారు. యువకులు, బీసీలకు పెద్దపీట వేస్తామన్నారు. సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉంటుందన్నారు.
ఇది కూడా చదవండి: Bandi sanjay: త్వరలోనే కేటీఆర్ అరెస్ట్.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో ప్రతీ నెలా రెండో శనివారం, ఆదివారం చంద్రబాబు హైదరాబాద్ కు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో తెలంగాణలోని పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతారని సమాచారం. ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. గత నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తో భేటీ కోసం హైదరాబాద్ కు వచ్చిన సమయంలో చంద్రబాబుకు ఇక్కడ ఘన స్వాగతం లభించింది. అనంతరం ఎన్టీఆర్ భవన్ లో పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశమయ్యారు.

ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. అయితే.. రానున్న స్థానిక సంస్థల నాటికి ఇక్కడ పార్టీని యాక్టీవ్ గా మార్చాలన్నది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది. అయితే.. ఇక్కడ కూడా బీజేపీతో పొత్తు ఉంటుందా? లేక టీడీపీ ఒంటరిగానే పని చేసుకుంటుందా? అన్న అంశంపై మాత్రం చంద్రబాబు ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. బీసీ నేతకు తెలంగాణ టీడీపీ నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: BREAKING: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం



#chandrababu-naidu #tdp #telangana-politcs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe