రేపే చంద్రబాబు పోలవరం టూర్.. ప్రాజెక్ట్ పనులపై కీలక ఆదేశాలు?

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబునాయుడు రేపు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లనున్నారు. ప్రాజెక్ట్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు.

రేపే చంద్రబాబు పోలవరం టూర్.. ప్రాజెక్ట్ పనులపై కీలక ఆదేశాలు?
New Update

ఏపీ సీఎం చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్ట్ పర్యటనకు వెళ్లనున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రతీ సోమవారం పోలవరం సందర్శనకు వెళ్లేవారు. సోమవారం పోలవారం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మళ్లీ అదే పద్ధతిని ప్రారంభించనున్నారు చంద్రబాబు. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు చంద్రబాబు అక్కడే ఉండనున్నారు. ప్రాజెక్టు పనులపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అక్కడ చకచకా ఏర్పాట్లు సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పరిస్థితిపై ఇప్పటికే అధికారులతో చంద్రబాబు రివ్యూ నిర్వహించారు.

ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి విషయానికి వస్తే.. హెడ్ వర్క్స్ పనులు 72.63 శాతం పూర్తయ్యాయి. రైట్‌ మెయిన్ కెనాల్ పనులు 92.75 శాతం పూర్తయ్యాయి. లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు 73.07 శాతం పూర్తయ్యాయి. పునరావసం, భూసేకరణ కేవలం 22.55 శాతమే పూర్తి అయ్యింది. ఓవరాల్‌గా ప్రాజెక్టు 49.79 శాతం పూర్తైంది. ప్రస్తుతం ఎర్త్ కం రాక్ ఫీల్ డ్యామ్ పనులు కొనసాగుతున్నాయి.

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe