/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/PM-Modi-.jpg)
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు వీరి భేటీ సాగింది. రాబోయే ఐదేళ్లు ఏం చేయాలి, ఏం సాయం కావాలన్న అంశాలపై ప్రధాని మోదీకి చంద్రబాబు వివరించినట్లు సమాచారం. ఎన్డీఏలో కీలకంగా ఉండడంతో చంద్రబాబు విజ్ఞప్తులపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలస్తోంది. ఏం కావాలో చెప్పాలంటూ చంద్రబాబుకు మోదీ సూచించారు. ఈ నేపథ్యంలో రాజధాని, పోలవరం, కేంద్రం నిధులపై ప్రధానంగా ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్‌తోనూ చంద్రబాబు చర్చలు జరిపారు.