Polavaram Project: పోలవరం పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎప్పుడంటే.. 

పోలవరం ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నెల 17న తానూ పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వస్తానని చెప్పారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం పనులపై సమీక్ష ఉంటుందని వెల్లడించారు. 

Polavaram Project: పోలవరం పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎప్పుడంటే.. 
New Update

CM Chandrababu Naidu to Visit Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధం అవుతున్నారు.  ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం (జూన్ 17) ప్రతిష్ఠాత్మకమైన పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. సీఎం హోదాలో తొలి యాత్రను  పోలవరం నుంచే ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. సోమవారం పోలవరంలో పర్యటించి ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించనున్నారు.

మళ్లీ ప్రతి సోమవారం..

గతంలో టీడీపీ (TDP) ప్రభుత్వ హయాంలో చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పై వారం.. వారం జరిపే సమీక్ష పద్ధతిని  ఏపీ సీఎం చంద్రబాబు మళ్ళీ ప్రారంభిస్తున్నారు.  పోలవరం ప్రాజెక్టుపై సమీక్షను ప్రతి సోమవారం నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ముందుగా పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులను నేరుగా పరిశీలిస్తారు. ఆ తర్వాత ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులతో సమీక్షించాలని చంద్రబాబు నిర్ణయించారు. మరోవైపు ప్రతి సోమవారం ప్రాజెక్టు అప్‌డేట్‌ను తనకు అందించాలని అధికారులను ఆదేశించారు.  రాష్ట్ర ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన పోలవరంపై అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశమవుతానని చంద్రబాబు వెల్లడించారు. 

పోలవరం ప్రాజెక్టు పనులపై ఆరా..

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారి వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న పనులు, జరుగుతున్న పనుల వివరాలను చంద్రబాబు ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో జలవనరుల శాఖ అధికారులతోనూ సీఎం సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, ప్రస్తుత పరిస్థితి, జరుగుతున్న పనులపై చంద్రబాబు ఆరా తీశారు. వైసీపీ ప్రభుత్వం రివర్స్ బిడ్డింగ్ పేరుతో పనులను పక్కనబెట్టిందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఇకపై  అలా జరగదని, మళ్లీ ప్రతి సోమవారం పోలవరం కార్యక్రమాన్ని సమీక్షిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తేనే ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి అర్థమవుతుందని భావించిన చంద్రబాబు జూన్ 17న పోలవరం పరిశీలనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని సీఎం భావిస్తున్నారు.

Also Read: త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ – సీఎం చంద్రబాబు నాయుడు

#chandrababu-naidu #polavaram-project
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe