విభజన హామీల పరిష్కారానికి కృషి చేయాలని టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో ఈ రోజు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ భేటీ జరిగింది. వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రాభివృద్దే ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీ పడి పని చేయాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారన్న అంశంపై భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Naga Babu: జగన్ శవ రాజకీయాల్లో ఆరితేరారు.. నాగబాబు ఘాటు విమర్శలు
Jagan-Chandrababu: జగన్ ను లైట్ తీసుకోండి.. ఎంపీలతో చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఢిల్లీలో జగనేం చేస్తాడో కాదు.. మనమేం చేయాలనేదే ముఖ్యమని చంద్రబాబు ఎంపీలతో అన్నారు. ఈ రోజు అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ ను అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని అన్నట్లు తెలుస్తోంది.
Translate this News: