AP CID Press Meet: చంద్రబాబు అరెస్టుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయ రగడ మొదలైంది. సీఎం డౌన్ డౌన్ అంటూ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ నిర్భందించడంతో ఆందోళన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. అయితే, మరోవైపు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించి మీడియా సమావేశాన్ని నిర్వహించింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారని తెలిపారు.

AP CID Press Meet: చంద్రబాబు అరెస్టుపై సీఐడీ సంచలన వ్యాఖ్యలు..!
New Update

AP CID Press Meet: ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయ రగడ మొదలైంది. సీఎం డౌన్ డౌన్ అంటూ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ నిర్భందించడంతో ఆందోళన పరిస్ధితులు కనిపిస్తున్నాయి.

చంద్రబాబు అరెస్టుపై సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ ప్రెస్ మీట్ :

➼ ఈరోజు ఉదయం 6 గంటలకు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేశాo.

➼ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబును అరెస్ట్ చేశాం.

➼ రూ.550 కోట్ల స్కామ్ ఇది.

➼ప్రభుత్వానికి 371 కోట్ల నష్టం వచ్చింది.

➼ నకిలీ ఇన్ వాయిస్ ద్వారా సెల్ కంపెనీలకు నిధులు మళ్లించారు.

➼ దర్యాప్తులో ప్రధాన నిందితుడు చంద్రబాబునాయుడే అని తేలింది.

➼ చంద్రబాబుకు అన్ని లావాదేవీల గురించి తెలుసు.

➼ ఈ స్కాము కు సంబంధించి కీలక డాక్యుమెంట్లు మాయం చేశారు.

➼ ఈడి..జిఎస్టి ఏజెన్సీలు కూడా ఈ స్కాంపై దర్యాప్తు చేశాయి.

➼ ఈ స్కామ్ లో ఫైనల్ బెనిఫిషరీ కూడా చంద్రబాబే..

న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకునే అరెస్ట్ చేశాo .

➼ చంద్రబాబును కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిందే..

➼ నిధులు దారి మళ్లింపుకు సంబంధించి చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉంది.

➼2014 జూలై నాటికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు..

➼ కార్పొరేషన్ ఏర్పాటుకు ముందే డిజైన్ టెక్ తో ఒప్పందం కుదిరింది.

➼ క్యాబినెట్ ఆమోదం లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.

➼ గంట సుబ్బారావు ఏకంగా నాలుగు పదవులు కట్టబెట్టారు.

Also Read: టీడీపీ లీడర్స్‌ అరెస్ట్..ఏపీలో హై టెన్షన్‌..!

#chandrababu-arrest #chandrababu-naidu-arrested #ap-cid-press-meet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe