Big Breaking: నారా లోకేష్ కు సీఐడీ నోటీసులు.. ఈ నెల 4న అరెస్ట్?

ఏపీ సీఐడీ అధికారులు నారా లోకేష్ కు నోటీసులు పంపించారు. లోకేష్ వాట్సాప్ కు 41 ఏ కింద నోటీసును పంపించారు. ఇందుకు నారా లోకేష్ సైతం స్పందించారు. నోటిసులు అందుకున్నానంటూ సీఐడీ అధికారులకు సమాధానం ఇచ్చారు.

Big Breaking: నారా లోకేష్ కు సీఐడీ నోటీసులు.. ఈ నెల 4న అరెస్ట్?
New Update

ఏపీ సీఐడీ అధికారులు నారా లోకేష్ కు (Nara Lokesh) నోటీసులు పంపించారు. లోకేష్ వాట్సాప్ కు 41 ఏ కింద నోటీసును పంపించారు. ఇందుకు నారా లోకేష్ సైతం స్పందించారు. నోటిసులు అందుకున్నానంటూ సీఐడీ అధికారులకు సమాధానం ఇచ్చారు. అక్టోబర్ 4వ తేదీన ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు అధికారులు. ఢిల్లీలోని అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో లోకేష్ ఉండగా ఈ నోటీసులు అందాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి ఈ నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో లోకేష్ ఈ నెల 4న ఏపీ రానున్నారు. అయితే.. విచారణ అనంతరం ఆయనను ఆరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇది కూడా చదవండి: Big Breaking: యనమలకు టీడీపీ పగ్గాలు.. చంద్రబాబు కీలక నిర్ణయం?

అయితే.. లోకేష్ కు నేరుగా కూడా నోటీసులు ఇచ్చారు సీఐడీ అధికారులు. దీంతో పాటు మెయిల్ ద్వారా కూడా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. వాట్సాప్ లో పంపిన తర్వాత మళ్లీ ఎందుకు వచ్చారని సీఐడీ అధికారులను లోకేష్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏ కేసు గురించి వచ్చారని కూడా లోకేష్ అడిగినట్లు సమాచారం. లోకేష్ కు 41ఏ సెక్షన్ గురించి సీఐడీ అధికారులు వివరించినట్లు సమాచారం. నోటీసులు క్షుణ్ణంగా చదువుతానని అధికారులతో లోకేష్ అన్నట్లు తెలుస్తోంది. అనంతరం రాక, రాక వచ్చారు కదా.. టీ, కాఫీ తాగాలని సీఐడీ అధికారులతో లోకేష్ కోరగాజ.. వారు తిరస్కరించినట్లు సమాచారం. ఈ అంశంపై సీఐడీ అధికారులు స్పందించారు. లోకేష్ ను తాడేపల్లి సీఐడీ ఆఫీసుకు విచారణ నిమిత్తం పిలిచినట్లు తెలిపారు. ఈ విషయాన్ని నోటీసుల్లో పేర్కొన్నట్లు చెప్పారు.

ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కేసు విషయాలపై లాయర్లతో ఎప్పటికప్పుడు ఆయన చర్చలు జరుపుతున్నారు. అయితే.. లోకేష్ ను అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటన్న చర్చ టీడీపీలో సాగుతోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు సైతం జైలులో ఉన్న నేపథ్యంలో లోకేష్ కూడా అరెస్ట్ అయితే.. టీడీపీకి నాయకత్వం ఎవరు వహిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.

#nara-lokesh #tdp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe