Nara Lokesh: నారా లోకేష్ కు ఏపీ సీఐడీ షాక్.. నోటీసులు జారీ!

నారా లోకేష్ కు ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నాడని అధికారులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు సూచనలతో లోకేష్ కు పోలీసులు వాట్సాప్ లో నోటీసులు పంపించారు. నోటీసు అందుకున్నట్లు వాట్సాప్ లో సీఐడీ కి సమాధానం ఇచ్చారు లోకేష్‌.

New Update
AP Mega DSC : మెగా డీఎస్సీలో సిలబస్ మార్పు.. మంత్రి లోకేష్ ఏమన్నారంటే!

నారా లోకేష్ కు ఏపీ సీఐడీ (AP CID) షాక్ ఇచ్చింది. రెడ్ బుక్ పేరుతో లోకేష్ (Nara Lekesh) బెదిరిస్తున్నాడని అధికారులు ఏసీబీ కోర్టును (AP ACB Court) ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కు నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు లోకేష్ కు పోలీసులు వాట్సాప్ లో నోటీసులు పంపించారు. నోటీసు అందుకున్నట్లు వాట్సాప్ లో సీఐడీ కి సమాధానం ఇచ్చారు లోకేష్‌. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేసింది న్యాయమూర్తి.
ఇది కూడా చదవండి: AP: కోడికత్తి, బాబాయ్ మర్డర్ సినిమాలు కూడా తీయండి.. ఆర్జీవీకి లోకేష్ సలహా

ఈ నేపథ్యంలో సీఐడీ నోటీసులకు నారా లోకేష్ ఎలా రియాక్ట్ అవుతారు? కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఏపీ పాలిటిక్స్ లో ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉంటే.. సీఐడీ కేసులను ప్రభావితం చేసేలా లోకేష్‌ వ్యాఖ్యలు చేశారని సీఐడీ ఆరోపిస్తోంది. నోటీసులు ఇవ్వడానికి నిన్ననే లోకేష్ ఉండవల్లి ఇంటికి అధికారులు వెళ్లారు. అయితే లోకేష్ నిన్న సీఐడీ అధికారులకు అందుబాటులోకి రాలేదు. దీంతో వాట్సాప్ లో నోటీసులు పంపించారు.

Advertisment
తాజా కథనాలు