Chandrababu New Case: ఏ2గా చంద్రబాబు.. ఏపీ సీఐడీ మరో కేసు

చంద్రబాబుకు మరో షాక్ ఇచ్చింది ఏపీ సీఐడీ. ఏపీ మైనింగ్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఫిర్యాదుతో మరో కొత్త కేసును నమోదు చేసింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా చంద్రబాబు వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

New Update
Chandrababu New Case: ఏ2గా చంద్రబాబు.. ఏపీ సీఐడీ మరో కేసు

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ (AP CID) మరో కేసు నమోదు చేసింది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై ఏపీఎండీసీ (APMDC) ఫిర్యాదు చేయడంతో ఈ కేసును నమోదు చేసింది సీఐడీ. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి  పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు నాయిడు (Chandrababu), ఏ3గా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏ4గా మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్లను చేర్చారు. వీరంతా ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేశారని ఏపీ మైనింగ్ డవలప్మెంట్ కార్పొరేషన్ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో చంద్రబాబుపై కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. ఇప్పటికే చంద్రబాబుపై స్కిల్ డవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ తదితర వ్యహారాల్లో అవకతవకలు చేశారంటూ కేసులు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Chandrababu: చంద్రబాబుకు తెలంగాణ పోలీసుల షాక్.. కేసు నమోదు!

స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ కూడా చేసింది సీఐడీ. దీంతో 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన ఉన్నారు. ఇటీవలే అనారోగ్య కారణాల రీత్యా హైకోర్టు 4 వారాల పాటు బెయిల్ ఇవ్వడంతో ఆయన విడుదలయ్యారు. చంద్రబాబుకు బెయిల్ రావడానికి ఒక రోజు ముందు కూడా మరో కొత్త కేసును నమోదు చేసింది ఏపీ సీఐడీ. మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని కేసు నమోదు చేసింది.

దీంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్ గడువు పూర్తయ్యే వరకు ఇతర ఏ కేసుల్లోనూ చంద్రబాబును అరెస్ట్ చేయమని అడ్వకేట్ జనరల్ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్తగా నమోదైన ఈ కేసు విషయంలోనూ చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు