ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో (AP CID IRR Case) దర్యాప్తు అధికారి మార్పు చేసింది సీఐడీ (CID). ప్రస్తుతం ఉన్న ఏఏస్పీ జయరాజు స్థానంలో డీఎస్పీ విజయ భాస్కర్ కు బాధ్యతలు అప్పగించింది. ఇందుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖల్ చేసింది. జయరాజుకు పని భారం ఎక్కువగా ఉండటంతో దర్యాప్తు అధికారిని మార్పు చేసినట్లు పిటిషన్ లో సీఐడీ (CID) పేర్కొంది. ఇదిలా ఉంటే.. వ్యక్తిగత కారణాలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నేడు సెలవులో ఉన్నారు. దీంతో కోర్టులో జరగాలసిన విచారణ రేపటికి వాయిదా పడింది. చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల విచారణ సైతం రేపటికి వాయిదా పడింది.
ఇది కూడా చదవండి: Chandrababu Naidu Case Updates: చంద్రబాబుకు బిగ్ షాక్.. తాజా అప్టేట్స్ ఇవే!
ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో నిర్మించతలపెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ను మార్పులను టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులకు మేలు జరిగేలా మార్చారని సీఐడీ అభియోగాలు మోపుతోంది. ఈ కేసులో చంద్రబాబు (Chandrababu Naidu), లోకేష్ (Nara Lokesh), మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్ తదితరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి నేడు నారా లోకేష్ సీఐడీ ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారిని మార్చడం చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి: Nara Lokesh : లోకేష్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఏపీ సీఐడీ.. అడుగుతున్న క్వశ్చన్స్ లిస్ట్ ఇదే!
ఇదిలా ఉంటే.. ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 11న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే.. సీఐడీ నోటీసులపై పునీత్ హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని ఆయన కోర్టును కోరారు. హైకోర్టు ఈ రోజు ఈ పిటిషన్‌పై విచారణ నిర్వహించనుంది.