/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Nara-Lokesh-1-jpg.webp)
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చుట్టు ఉచ్చు బిగిస్తున్నారు సీఐడీ అధికారులు. ఈ కేసులో లోకేష్ ను A14 గా చేరుస్తూ హైకోర్టు లో ఏపీ సీఐడీ ఈ రోజు మెమో దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబు కేసుల విషయమై న్యాయవాదులో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో ఆయన చేపట్టిన యువగళం పాదయాత్రకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ యాత్రను వచ్చే వారంలో తిరిగి ప్రారంభించాలని లోకేష్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలతో ఇటీవల నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో యాత్ర ప్రారంభానికి ముందే లోకేష్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది.