AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు.. ఆ ముగ్గురికి షాక్!

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. మొత్తం 19 మంది IAS అధికారులను బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాష్‌ ను GADలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

New Update
AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు.. ఆ ముగ్గురికి షాక్!

Andhra Pradesh : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) పాలనపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా భారీగా ఐఏఎస్ ల బదిలీ (IAS Transfers) లను చేపట్టారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాష్‌ తదితరులను పక్కన పెట్టారు. సీఆర్డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్ ను నియమించారు. పంచాయతీరాజ్ శాఖ (Panchayat Raj) ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్, వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శిగా రాజశేఖర్, ఆర్థిక శాఖ కార్యదర్శిగా జానకి, జలవనరుల శాఖ చీఫ్ సెక్రటరీగా సాయి ప్రసాద్ ను నియమించింది చంద్రబాబు సర్కార్. రానున్న రోజుల్లో మరిన్ని బదీలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో భారీగా కలెక్టర్లు, ఎస్పీలు బదిలీ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

బదిలీల తర్వాత ఏ పోస్టులో ఎవరంటే?
- పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్
- వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్
- కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది
- జలవనరుల శాఖ చీఫ్ సెక్రటరీగా సాయి ప్రసాద్
- పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్
- సివిల్ సప్లైస్ కమిషనర్‌గా సిద్ధార్థ్ జైన్
- పాఠశాల విద్యా శాఖ కార్యదర్శిగా కోన శశిధర్
- సీఎం సెక్రటరీగా ప్రద్యుమ్న
- CRDA కమిషనర్‌గా కాటమనేని భాస్కర్
- ఆర్థిక శాఖ కార్యదర్శిగా జానకి
- ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్

Advertisment
Advertisment
తాజా కథనాలు