AP TET And DSC Exam Dates: టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. వారి నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు పరీక్షల కోసం సన్నద్ధం అవ్వడానికి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఫైల్ పై చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో హామీ మేరకు ఈ మొత్తం ప్రక్రియ ను ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం.
అయితే నూతనంగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న వారికి కూడా మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించాలని ఆయా అభ్యర్థులు కోరారు. దీంతో వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని టెట్ నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకి సన్నద్ధం అవ్వడానికి తమకు మరింత సమయం ఇవ్వాలని అభ్యర్థులు, వివిధ విద్యార్థి, యువజన సంఘాలు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
అభ్యర్థుల అభ్యర్థన మేరకు మంత్రి విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వారందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష రాయడానికి సన్నద్ధం అవ్వడానికి టెట్ పరీక్ష నిర్వహణ కు 90 రోజులు, మెగా డీఎస్సీ నిర్వహణ కు 90 రోజుల సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే టెట్, డీఎస్సీ నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: పవన్‌కు జీవితాంతం రుణపడి ఉంటా.. బాలిక తల్లి భావోద్వేగం!