AP TET And DSC Exam Dates: టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. వారి నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు పరీక్షల కోసం సన్నద్ధం అవ్వడానికి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఇచ్చిన మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఫైల్ పై చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో హామీ మేరకు ఈ మొత్తం ప్రక్రియ ను ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం.
పూర్తిగా చదవండి..AP TET, DSC Exam Dates: ఏపీలో టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలపై సర్కార్ కీలక నిర్ణయం
ఏపీలో టెట్, మెగా డీఎస్సీ పరీక్షల తేదీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ పరీక్ష నిర్వహణ కు 90 రోజులు, మెగా డీఎస్సీ నిర్వహణ కు 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Translate this News: