/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/AG-Dammalapati-Sreenivas-.jpg)
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు చక చకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా అడ్వకేట్ జనరల్ నియామకం చేపట్టారు. దమ్మలపాటి శ్రీనివాస్ ను అడ్వకేట్ జనరల్ గా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం దమ్మలపాటి AGగా వ్యవహరించారు. అనంతరం ప్రభుత్వం మారిన తర్వాత ఆయన పదవి నుంచి వైదొలిగారు. అమరావతి భూకుంభకోణంలో దమ్మలపాటిపై ఏసీబీ కేసు నమోదు చేసింది అప్పటి జగన్ సర్కార్. దమ్మలపాటి మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అల్లుడే కావడం విశేషం.