AP New Sand Policy: ఏపీలో ఫ్రీగా ఇసుక.. ఎప్పటి నుంచో తెలుసా?

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో ప్రజలకు ఉచితంగా ఇసుక అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఇసుక పాలసీని ఈ నెల 8 నుంచి అమల్లోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

New Update
CM Chandrababu: విభజన వల్ల ఏపీకి భారీ నష్టం జరిగింది.. దానిపై ఇంకా క్లారిటీ లేదు!

CM Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఇసుక విధానాన్ని (New Sand Policy) ఈ నెల 8 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఫ్రీగా ఇసుక అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. కేవలం లోడింగ్, రావాణా ఛార్జీలను ప్రభుత్వం నిర్ణయించనుంది. కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటు చేసే కమిటీ ఇందుకు సంబంధించిన ధరలను ఖరారు చేయనుంది. ఇదిలా ఉంటే.. ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో టీడీపీ (TDP) హయాంలోని ఇసుక పాలసీకి.. జగన్ ప్రభుత్వ ఇసుక పాలసీకి తేడాను అధికారులు వివరించారు. గత ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల నష్టం జరిగిందని చంద్రబాబుకు అధికారులు తెలిపినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభానికి గురైందని అధికారులు పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించడంతో చాలా ఇబ్బందులు వచ్చాయని సీఎంకు అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ధరల తగ్గింపుపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. తక్షణం నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర మార్గాలు చూడాలన్నారు. రోడ్ల మరమ్మత్తులపై ఫోకస్ పెట్టాలన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త ఇసుక పాలసీపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: అమరావతిపై చంద్రబాబు శ్వేతపత్రం

Advertisment
తాజా కథనాలు