AP CEO: జగన్ పై రాయి దాడి కేసు.. ఏపీ సీఈఓ కీలక ప్రకటన..! సీఎం జగన్ పై దాడికి సంబంధించి ఏపీ CEO మీనా కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సీపీ స్వయంగా వచ్చి కేసు గురించి వివరించారన్నారు. ఒక వ్యక్తిని గుర్తించి కోర్టులో ప్రవేశపెట్టారని తెలిపారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి వచ్చే పోలీస్ పరిశీలకులు కేసును స్వయంగా పరిశీలిస్తారన్నారు. By Jyoshna Sappogula 18 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP CEO Mukesh Kumar Meena: సీఎం జగన్ దాడిపై ఏపీ CEO మీనా స్పందించారు. సీఎం పై జరిగిన దాడి గురించి అదే రోజు నివేదిక కోరామన్నారు. విజయవాడ సీపీ స్వయంగా వచ్చి కేసు గురించి వివరించారని తెలిపారు. ప్రతి రోజూ పోలీస్ అధికారులు నివేదిక ఇస్తున్నారన్నారు. ఒక వ్యక్తిని గుర్తించి కోర్టులో ప్రవేశపెట్టారని వెల్లడించారు. ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పోలీస్ ఆబ్జర్వర్ కు కేసు వివరాలు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి వచ్చే పోలీస్ పరిశీలకులు కేసును స్వయంగా పరిశీలిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీఐపీల భద్రత గురించి కొత్తగా నిబంధనలు పంపించామన్నారు. Also Read: బోండా ఉమాకి జగన్ పై దాడి గురించి తెలుసు..కేశినాని సంచలన వ్యాఖ్యలు..! ఈ క్రమంలోనే సీనియర్ అధికారుల మీద ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ వంటి వారి నుంచి కూడా వివరణలు తీసుకున్నామన్నారు. ఆ వివరణలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అన్ని రకాలుగా సమాచారాన్ని సేకరించుకుని చర్యలు తీసుకుంటుందన్నారు. మొదటిసారి.. ఇదిలా ఉండగా..ఈ నెల 25 వరకూ నామినేషన్లు స్వీకరణ ఉంటుందని..26న నామినేషన్లు పరిశీలన ఉంటుందని తెలిపారు. 29 వరకూ నామినేషన్లు ఉపసంహరణ గడువు ఉంటుందని..6 అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్ ఉంటుందని వెల్లడించారు. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 వరకూ పోలింగ్ ఉంటుందన్నారు. మొదటిసారి ఏపీ ఎన్నికలకు 18 మంది పోలీసు పరిశీలకులను నియమించారన్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి హోం ఓటింగ్ అవకాశం ఉంటుందని.. ఇవాల్టి నుంచి హోం ఓటింగ్ ప్రక్రియ మొదలైందన్నారు. 29 వరకూ హోం ఓటింగ్ కోసం అప్లికేషన్లు తీసుకుంటామన్నారు. 5,26,000 మందికి పోస్టల్ బ్యాలెట్ ఉంటుందన్నారు. Also Read: టైమ్ మ్యాగజైన్ లో మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల..! ఈ క్రమంలోనే రాష్ట్రంలో 12,459 క్లిష్టమైన పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. ఇలాంటి కేంద్రాలతో కలిపి 30,111 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ 121 కోట్ల విలువైన నగదు, మద్యం,అభరణాలు స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అలాగే 1017 మంది వాలంటీర్ లను తొలగించామన్నారు, 86 మందిపై కేసులు నమోదు అయ్యాయని, 44,163 మంది రాజీనామా చేశారని పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘనపై టీడీపీ పై 126 కేసులు, వైసీపీ పై 136 కేస్ లు, ఇతర పార్టీల వారిపై 76 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. #cm-jagan-attack #ap-ceo-mukesh-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి