BREAKING: ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ

AP: ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదంపై చర్చించనున్నట్లు సమాచారం.

AP: ఏపీ కేబినెట్ సమావేశం.. ఈ అంశాలపై కీలక చర్చ..!
New Update

AP Cabinet Meet: ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదంపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు చర్చించే అంశాలు శాఖల వారీగా ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు..

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడం కష్టమని భావిస్తోంది ఆర్ధికశాఖ. అందుకే ఇప్పుడున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్టును కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసింది. దాని ప్రకారం ఈ నెల 22వ తేదీ లేదా దాని తరువాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని అనుకుటోంది. మరో నాలుగు నెలల పాటు ఓటాన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తేవాలని ఏపీ ఆర్థిక శాఖ ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. ఆర్థిక వెసులుబాటు.. వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై క్లారిటీ రావడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. అప్పటికి ఏపీ ఆర్ధిక పరిస్థితిపై ఓ క్లారిటీ వస్తుందని..అప్పుడు సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని ఆర్థిక శాఖ అనుకుటోంది. ఈ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు దగ్గర కూడా తీసుకెళ్ళింది. ఆర్డినెన్స్ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురు చూస్తోంది. 

#ap-cabinet-meet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe