AP: ఐదు సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోదం.. వైసీపీ అవినీతి అక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు..!

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. వివిధ శాఖల శ్వేత పత్రాల విడుదలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

New Update
AP News: రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ.. ఐఐటీ ప్రొఫెసర్లతో చంద్రబాబు సమీక్ష

AP Cabinet meeting: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన మొదటి కేబినెట్‌ భేటి ముగిసింది.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సంతకాలు పెట్టిన ఐదు సంక్షేమ పథకాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

ఐదు సంక్షేమ పథకాలు..

1.మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ
2. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
3.పెన్షన్ రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంపు
4.అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ
5.నైపుణ్య గణన (స్కిల్ సెన్సస్)

అలాగే, విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు NTR వర్సిటీగా మార్పునకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా వివిధ శాఖల శ్వేత పత్రాల విడుదలకు సంబంధించి క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. శ్వేత పత్రాల విడుదలపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Also Read: పవన్ కళ్యాణ్‌తో భేటీ.. స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరిన ప్రముఖ నిర్మాతలు..!

ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో ఆయా శాఖలో జరిగిన అవినీతి అక్రమాలు, ఆర్థిక అవకతవకులపై మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనం చేయనుంది. మంత్రివర్గ ఉప సంఘంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ, నాదెండ్ల మనోహర్, హోం మంత్రి అనిత, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని ఉండే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా శ్వేత పత్రాల విడుదల చేయనుంది.

Also Read: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి ఏం చేశారంటే..?

అలాగే, పోలవరం ప్రాజెక్టు విషయంపై క్యాబినెట్లో చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టును ఐదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని చంద్రబాబు ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో డామేజ్ గురైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏ విధంగా చేయాలనే దాని పై క్యాబినెట్ లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే అమరావతి నిర్మాణాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలి, నిధుల సమీకరణ ఏవిధంగా చేయాలి అనే అంశంపై క్యాబినెట్లో చర్చించినట్లు సమాచారం...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు