YCP Seethamraju Sudhakar: ఏపీ అధికార పార్టీ వైసీపీలో అసమ్మతి నేతలు పెరిగిపోతున్నారు. ఇంఛార్జులను మార్చడంతో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలోని కొందరు ముఖ్యనేతలు అసహనం వ్యక్తం చేస్తూ రాజీనామ బాటలో నడుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా, విశాఖలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆయన తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపారు.
Also Read: అందరికీ ప్రధాని మోదీ అదిరిపోయే న్యూఇయర్ గిఫ్ట్..పెట్రోల్ రేట్ల భారీ తగ్గింపు!
వైస్సార్, విజయమ్మలకు అత్యంత నమ్మకస్థుడిగా ఉన్నారు సీతంరాజు సుధాకర్. రెండు దశాబ్దాలుగా వైస్సార్, వైసీపీ లకు విధేయుడిగా ఉన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. విశాఖ సౌత్ టికెట్ ను సీతంరాజు సుధాకర్ ఆశించి బంగపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, సీతంరాజు సుధాకర్ ఎమ్మెల్యే వాసుపల్లి సుధాకర్ మధ్య కొద్దిరోజులుగా వైరం నడుస్తోంది.
స
Also Read: గుంటూరు కారంలో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్.. యూట్యూబ్ లో యమ ట్రెండింగ్!
సౌత్ ఇంఛార్జి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. పార్టీకి ఎంతో నమ్మకంగా పనిచేసిన సుధాకర్ రాజీనామ చేయడంతో అధికార పార్టీ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాజీనామను సీతంరాజు సుధాకర్ వెనక్కి తీసుకునేలా అధిష్టానం బుజ్జగిస్తుందా? లేదంటే ఉంటే ఉంటారు లేదంటే లేదు అని వదిలేస్తారా ? అనేది తెలియాల్సి ఉంది.