Vishaka: వైసీపీలో వన్ సై డ్ లవ్ భరించలేక ఇలా చేశాను.. మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు

వైసీపీలో వన్ సై డ్ లవ్ భరించలేక పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని తెలిపారు మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్. జీవీఎంసీలో సగం మంది కార్పొరేటర్లు వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. విశాఖలో వైసీపీని ఖాళీ చేయడమే లక్ష్యంగా పని చేస్తానని తేల్చిచెప్పారు.

New Update
Vishaka: వైసీపీలో వన్ సై డ్ లవ్ భరించలేక ఇలా చేశాను.. మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు

Vishaka: విశాఖలో మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీలో వన్ సై డ్ లవ్ భరించలేక పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీలో ముఖ్యనాయకులకు జరిగిన అవమానమే తనకు ఎదురైందని చెప్పుకొచ్చారు. జీవీఎంసీలో సగం మంది కార్పొరేటర్లు వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇది చీలిక కాదని.. పార్టీలో పరిస్థితులపై ఎదురౌతున్న వ్యతిరేకతని వ్యాఖ్యనించారు.

Also Read: ప్రియుడి కోసం బరితెగించిన భార్య.. భర్తపై భారీ స్కెచ్.. బలైనా అమాయకురాలు..!

విశాఖలో వైసీపీని ఖాళీ చేయడమే తన లక్ష్యంగా పని చేస్తానని తేల్చి చెప్పారు. ఇప్పటికే పార్టీ వీడిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఇదే విషయం చెప్పారన్నారు. దక్షిణ నియోజకవర్గ మత్స్యకార, ఎస్.సి.ముఖ్య నాయకత్వం సూచనలకు అనుగుణంగా రాజకీయ నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామ చేశారు.

Also Read: బేబీ బ్యూటీ మామూలుగా లేదుగా..!

వైస్సార్, విజయమ్మలకు అత్యంత నమ్మకస్థుడిగా ఉన్నారు సీతంరాజు సుధాకర్. రెండు దశాబ్దాలుగా వైస్సార్, వైసీపీ లకు విధేయుడిగా ఉన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. విశాఖ సౌత్ టికెట్ ను సీతంరాజు సుధాకర్ ఆశించి బంగపడ్డారు. పార్టీకి ఎంతో నమ్మకంగా పనిచేసిన సుధాకర్ రాజీనామ చేయడంతో అధికార పార్టీ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది.

Advertisment
తాజా కథనాలు