Purandeswari: చంద్రబాబు అరెస్ట్..పురందేశ్వరి ఏమన్నారంటే!

చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని ఆమె ఖండించారు. సరైన నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. FIRలో కనీసం పేరు లేకుండా, ఎలాంటి వివరణా తీసుకోకుండా ఏ విధంగా అరెస్టు చేస్తారని పురందేశ్వరి ప్రశ్నించారు. ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబుని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. బీజేపీ దీనిని ఖండిస్తుంది అని తెలిపారు.

New Update
Purandeswari: చంద్రబాబు అరెస్ట్..పురందేశ్వరి ఏమన్నారంటే!

Purandeswari on Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని ఆమె ఖండించారు. సరైన నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. FIRలో కనీసం పేరు లేకుండా, ఎలాంటి వివరణా తీసుకోకుండా ఏ విధంగా అరెస్టు చేస్తారని పురందేశ్వరి ప్రశ్నించారు. ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబుని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. బీజేపీ దీనిని ఖండిస్తుంది అని తెలిపారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఉదయం 6 గంటల సమయంలో ఆయనను అరెస్ట్ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద ఆయనకు నోటీసు ఇచ్చి  అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్టు చేశారు.దీంతో టీడీపీ ఆందోళనల నేపధ్యంలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడే టీడీపీ ముఖ్యనేతలను ముందస్తుగా అరెస్ట్ చేసి కట్టడి చేస్తున్నారు.

Also Read: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ఏంటి? ఇందులో చంద్రబాబు పాత్ర ఏంటి?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు