AP Bandh: ఈ నెల 24న ఏపీ బంద్‌.. జగన్ సర్కార్ పై విపక్షాల మండిపాటు

అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఈనెల 24వ తేదీన ఏపీ బంద్‌కు విపక్షాలు పిలుపునిచ్చాయి. అంగన్వాడీలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిని అరెస్ట్‌ చేయడంతో పాటు ప్రభుత్వం అల్టిమేటంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

New Update
AP Bandh: ఈ నెల 24న ఏపీ బంద్‌.. జగన్ సర్కార్ పై విపక్షాల మండిపాటు

దీంతో, పోలీసుల తీరుపై  విపక్ష సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంగన్వాడీలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన చేస్తే అడ్డుకుని అరెస్ట్ చేస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు. వారిని అరెస్ట్ చేయడం అన్యాయం అంటూ వాపోతున్నారు. ప్రభుత్వం అల్టిమేటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంగన్వాడీలకు మద్దతుగా ఈ నెల 24వ తేదీన ఏపీ బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: అయోధ్యలో బాలరాముడి దర్శన వేళలు ఇవే.. ఇలా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు

ఇదిలా ఉండగా, మరోవైపు ఈ రోజు ఉదయం 10 గంటల లోపు విధుల్లో చేరని అంగన్‌వాడీలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 20 శాతం మంది అంగన్వాడీలు విధుల్లో చేరారు. విధుల్లో చేరని వారిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా, ఈ నెల 24న అంగన్వాడీల టెర్మినేషన్ పై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 25న కొత్త సిబ్బందిని చేర్చుకునేలా రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వనుంది. ఈ నిర్ణయంపై  అంగన్వాడీలు మరింతగా జగన్ సర్కార్ పై మండిపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు