AP Assembly: రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు బీఏసీ మావేశం అనంతరం ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. By Karthik 20 Sep 2023 in గుంటూరు రాజకీయాలు New Update షేర్ చేయండి రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు బీఏసీ మావేశం అనంతరం ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. సభను ఎన్ని రోజులు నడపాలనేదానిపై బీఏసీ సభలో నిర్ణయం తీసునున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశాల్లోరాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ మస్తు బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. దీంతోపాటు విదేశీ విద్యపై ప్రభుత్వం చర్చ జరుపనుంది. వైఎస్‌ఆర్ ఉచిత పంట బీమా, నామనిర్దేశ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత అంశంపై చర్చించి సభ ఆమోదం తెలపనుంది. దీంతోపాటు రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులపై సభ్యులు చర్చింనున్నారు. ఇమామ్, మౌజన్, పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచబోతున్నట్లు సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రసంగించనున్నారు. దీంతోపాటు మెగా విత్తన కేంద్రం, గిరిజన సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, వాటివల్ల వారికి కలుగుతున్న ప్రయోజనాలపై సభలొ చర్చించనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనున్నట్లు టీడీపీ ప్రకటించింది. రేపటి నుంచి మొదలయ్యే ఏపీ శాశససభా సమావేశాలకు తమ ఎమ్మెల్యేలు హాజరవుతారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. రేపటి నుంచి ఈ నెల 27 వరకు జరగనున్న సమావేశాలలో పార్టీ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారని వెల్లడించారు. దీంతో పాటు చంద్రబాబు అరెస్ట్, తరువాత రాష్ట్రంలో పరిణామాల మీద సభలో ప్రశ్నిస్తామని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంతగా అవమానించినా ప్రజల కోసం భరిస్తామరి లోకేష్ సూచించారు. పోరాడదాం అని నిర్ణయం తీసుకున్నాక దాని కోసం ఎన్ని అవమానాలనైనా భరిస్తామని లోకేష్ తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ తో పాటూ రాష్ట్రంలో ఉన్న పలు సమస్యల మీద శాశనసభలో మాట్లాడాలని.. ఇలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదని ఆయన టీడీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. సభలో ప్రభుత్వం పోరాటం చేస్తామని, వీధుల్లో చేయాల్సింది వీధుల్లో చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను ఆపొద్దని లోకేష్ టీడీపీ శ్రేణులకు తేల్చి చెప్పారు. #ap-assembly #foreign-education #discussion #approval #ysr-crop-insurance మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి