BREAKING: ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీలో ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు, స్పీకర్ ఎన్నిక ఉంటుంది.

BREAKING: ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
New Update

ఏపీలో ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్ లో ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు, స్పీకర్ ఎన్నిక ఉంటుంది. వాస్తవానికి ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావించినట్లు ప్రచారం జరిగింది. తాజాగా తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజు.. అంటే 21న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ మరుసటి రోజు 22న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందని తెలుస్తోంది.

అయితే.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు ఇస్తారని సమాచారం. మరో ఒకటి రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రొటెం స్పీకర్ గా మరో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఈ నెల 22న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం కానున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe