Ap Assembly Sessions: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..! ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభించారు. ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించినట్లు తెలిపారు. By Jyoshna Sappogula 05 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Ap Assembly Sessions: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయాలను వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించామన్నారు. ఇచ్చిన హామీలను అమలుచేయడానికి త్రికరణశుద్ధితో పనిచేస్తున్నట్లు వ్యాఖ్యనించారు. అధికారంలోకి రాగానే విద్యాపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్య అంశాలు ఇవే.. 'విజయవాడలో 206 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం..సాంఘిక న్యాయం సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది..పేదపిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం..నవరత్నాల హామీలను మా ప్రభుత్వం అమలుచేసింది.. ప్రతి ఒక్కరికి ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం..విద్య కోసం 73వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టింది.. జగనన్న అమ్మ ఒడి పథకం కింద 15వేలు నేరుగా తల్లుల ఖాతాల్లో జమచేస్తోంది..దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చాం.. AP Governor Copy మాది పేదల పక్షపాత ప్రభుత్వం..పేదరికం 11.25 శాతం నుంచి 4.1శాతానికి తగ్గింది..జగనన్న గోరుముద్ద కింద నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం అమలుచేశాం.. 43లక్షలమందికి పైగా జగనన్న గోరుముద్ద పథకం..ఏడాదికి 4,416 కోట్లు ఖర్చుచేశాం..విద్యా కానుక కింద విద్యార్థులకు యూనిఫాం సహా బుక్స్..విద్యాకానుకకు 3,367 కోట్లు ఖర్చు చేశాం..ఐటీఐ, ఇంజనీరింగ్..11వేల కోట్లకు పైగా రీయింబర్స్ చేశాం' అని ప్రభుత్వం అమలు పరిచిన పథకాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరిస్తూ పలు అంశాలు ప్రసంగించారు. #ap-assembly #ap-assembly-sessions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి