/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/AP-Assembly-Meet.jpg)
AP Assembly Meet: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండేళ్ల తరువాత సీఎం హోదాలో చంద్రబాబు అసెంబ్లీకి హాజరయ్యారు. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఈరోజు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మొదట చంద్రబాబు నాయుడుతో ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి. అనంతరం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాణాస్వీకారం చేశారు. మంత్రులు, ఆ తరువాత ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. కాగా తొలిసారి అసెంబ్లీలోకి లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారు. తెలుగు దేశం పార్టీ ఎప్పుడు గెలవని స్థానమైన మంగళగిరి నుంచి లోకేష్ భారీ మెజారిటీతో గెలుపొందారు. అలాగే పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గెలిచి అసెంబ్లీకి అడుగుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో తొలిసారిగా అడుగుపెట్టిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. ఆత్మీయంగా పలకరించుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు.#PawanKalyanAneNenu #GameChangerPK pic.twitter.com/fNfdgbrmHG
— JanaSena Shatagni (@JSPShatagniTeam) June 21, 2024