NTR Health University: హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు.. బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించే బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్దరిస్తూ సవరణ బిల్లును వైద్య శాఖ మంత్రి సత్య ప్రసాద్ ప్రవేశ పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

New Update
NTR Health University: హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు.. బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పునరుద్ధరణ బిల్లుకి శాసనసభ ఆమోదం తెలిపింది. విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్దరిస్తూ సవరణ బిల్లును వైద్య శాఖ మంత్రి సత్య ప్రసాద్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అడ్డగోలుగా ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టిందని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ పేరు ఓ బ్రాండ్ అని.. పేదలకు ఎన్టీఆర్ ఎంతో అండగా నిలిచారని కొనియాడారు. మహనీయుడైన ఎన్టీఆర్ పేరు మార్చాలనే ఆలోచన గత ప్రభుత్వానికి ఎలా వచ్చిందో..? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెడుతూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని నాటి ప్రతిపక్ష టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పడు టీడీపీ అధికారంలోకి రావడంతో హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్‌ పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు