AP Elections 🔴 LIVE UPDATES: ఏపీ, తెలంగాణలో ముగిసిన పోలింగ్

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గడువు ముగిసే సమయానికి క్యూ లైన్‌లలో నిలుచున్నవారందరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఈసీ ప్రకటించింది. ఏపీలో పలు చోట్ల ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

New Update
AP Elections 🔴 LIVE UPDATES: ఏపీ, తెలంగాణలో ముగిసిన పోలింగ్

  • May 13, 2024 18:43 IST

    తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివ కుమార్‌పై కేసు నమోదు



  • May 13, 2024 18:20 IST

    ఏపీలో సాయంత్రం 6 గంటల వరకు 75 శాతం పోలింగ్ నమోదు



  • May 13, 2024 18:07 IST

    ఏపీ, తెలంగాణలో ముగిసిన పోలింగ్.. సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికే ఓటు వేసే అవకాశం



  • May 13, 2024 17:58 IST

    తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా

    ImageImageImage

    Image



  • May 13, 2024 17:34 IST

    ఏపీలో సాయంత్రం 5 గంటల వరకు 68% పోలింగ్ నమోదు



  • May 13, 2024 17:31 IST

    తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61.16% పోలింగ్ నమోదు

    తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా జహీరాబాద్ లో 63.96%... అత్యల్పంగా హైదరాబాద్ లో 29.47% పోలింగ్ నమోదు



  • May 13, 2024 17:30 IST

    ఓటర్లకు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్

    Image



  • May 13, 2024 17:29 IST

    ఇంకా ఓటు వేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే పోలింగ్ కేంద్రానికి వెళ్ళి క్యూలైన్ లో నిలబడండి: టీడీపీ



  • May 13, 2024 17:25 IST

    ఎస్సై దాడి.. బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల నిరసన

    * కామారెడ్డి జిల్లా దోమకొండ ముత్యంపేటలో ఆందోళన
    * రోడ్డుపై నిలబడిన బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎస్సై గణేశ్‌ దాడి
    * ఎస్సై తీరును నిరసిస్తూ పోలింగ్‌ బూత్‌ వద్ద బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
    * ఎస్సై గణేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నేతల డిమాండ్‌



  • May 13, 2024 17:20 IST

    శ్రీకాకుళం జిల్లా- పాతపట్నం నియోజకవర్గం.. కొత్తూరు మండలంలో భారీగా కురుస్తున్న వర్షం.. వర్షం కురుస్తున్నా ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు.



  • May 13, 2024 17:12 IST

    నల్గొండ: స్వగ్రామం బ్రాహ్మణవెళ్లంలలో ఓటు వేసిన రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ



  • May 13, 2024 17:01 IST

    పల్నాడు జిల్లా రెంటచింతల మండలం జెట్టిపాలెంలో ఈవీఎంల ధ్వంసం.. ఈవీఎంలను పగలగొట్టిన టీడీపీ కార్యకర్తలు.. నిలిచిన పోలింగ్



  • May 13, 2024 17:00 IST

    గుంటూరు జిల్లా నరసరావుపేటలో కాల్పులు జరిపిన పోలీసులు.. స్థానిక ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పాల్పడ్డవారినీ కంట్రోల్ చేస్తూ రబ్బర్ బుల్లెట్ల ప్రయోగం...



  • May 13, 2024 16:57 IST

    ఏలూరులో ఓటు హక్కును వినియోగించుకున్న వయో వృద్దురాలు.

    Image



  • May 13, 2024 16:53 IST

    వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనవాసరెడ్డి ఇంటిపై టీడీపీ వర్గీయుల దాడి



  • May 13, 2024 16:49 IST

    120కిపైగా హింసాత్మక ఘటనలు.. సీఈసీకి టీడీపీ ఫిర్యాదు



  • May 13, 2024 16:48 IST

    ఏపీ ఎన్నికల్లో హింస.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు



  • May 13, 2024 16:46 IST

    జూబ్లీ క్లబ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రామ్‌ చరణ్, ఉపాసన



  • May 13, 2024 16:45 IST

    ఓటు హక్కును వినియోగించుకున్న మహేష్ బాబు

    హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని పబ్లిక్‌ స్కూల్‌ పోలింగ్‌ స్టేషన్‌లో తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి నటుడు మహేష్‌బాబు ఓటు వేశారు.



  • May 13, 2024 16:07 IST

    ఏపీలో మూడు నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

    ఏపీలోని అరకు, పాడేరు, రంపచోడవరంలో పోలింగ్ ముగిసింది. మిగిలిన 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.



  • May 13, 2024 16:01 IST

    తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

    సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేటలో పోలింగ్ ముగిసింది



  • May 13, 2024 16:00 IST

    మధ్యాహ్నం 3 గంటల వరకు ఏపీలో అత్యధికంగా చిత్తూరులో 61.94%.. అత్యల్పంగా విశాఖలో 46.01% పోలింగ్ నమోదు అయింది



  • May 13, 2024 15:58 IST

    శ్రీ సత్య సాయి జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల నాటికి నమోదైన పోలింగ్ శాతం.

    Image



  • May 13, 2024 15:50 IST

    ఏలూరు జిల్లా వ్యాప్తంగా 3 గంటలకు 57.11% పోలింగ్ నమోదయింది.

    ♦️చింతలపూడి:54.3%
    ♦️దెందులూరు:58.06%
    ♦️ఏలూరు:52.8%
    ♦️కైకలూరు:57.42%
    ♦️నూజివీడు:61.5%
    ♦️పోలవరం:53.48%
    ♦️ఉంగుటూరు:58.11%



  • May 13, 2024 15:47 IST

    ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు



  • May 13, 2024 15:38 IST

    ఉమ్మడి విజయనగరం జిల్లాలో మ. 3 గం.ల వరుకు నమోదైన పోలింగ్

    * చీపురుపల్లి నియోజకవర్గం 60.34
    * బొబ్బిలి నియోజకవర్గం 57.21
    * గజపతినగరం నియోజకవర్గం 59.64
    * విజయనగరం నియోజకవర్గం 52.1
    * నెల్లిమర్ల నియోజకవర్గం 51.92
    * శృంగవరపుకోట నియోజకవర్గం 55.79
    * ఓవరాల్ గా విజయనగరం పార్లమెంట్ 56 శాతం నమోదు
    * కురుపాం నియోజకవర్గం 52 శాతం నమోదు
    * సాలూరు నియోజకవర్గం 48.09 శాతం నమోదు
    * పార్వతీపురం నియోజకవర్గం 54. 62 శాతం నమోదు



  • May 13, 2024 15:35 IST

    ఓటేసేందుకు మొగ్గు చూపని హైదరాబాద్ వాసులు..



  • May 13, 2024 15:30 IST

    ఓటు హక్కును వినియోగించుకున్న మహబూబాబాద్ ఎస్పీ సుధీర్

    మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని FRO Centre లో గల ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS. అనంతరం ఎస్పీ..  మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఓటరు తన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.



  • May 13, 2024 15:22 IST

    ఏపీలో కొనసాగుతున్న పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం నమోదు



  • May 13, 2024 15:16 IST

    కేటీఆర్, ఈటల రాజేందర్ పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు



  • May 13, 2024 14:53 IST

    వైసీపీ దాడులపై చంద్రబాబు గరం



  • May 13, 2024 14:48 IST

    బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు



  • May 13, 2024 14:34 IST

    ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ ఐపీఎస్‌ ఆర్పీ ఠాకూర్‌పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

    టీడీపీకి అనుకూలంగా పనిచేసేలా ఎన్నికల సిబ్బందిని ప్రభావితం చేస్తున్నారు.. మంగళగిరి టీడీపీ ఆఫీస్‌ వేదికగా అధికారులను బెదిరిస్తున్నారు.. టీడీపీ ఆఫీస్‌లో కూర్చొని జిల్లాల పోలీసు అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు-వైసీపీ



  • May 13, 2024 14:31 IST

    ఉప్పల్ లో విషాదం.. ఓటు వేయడానికి వెళ్లిన మహిళ గుండె పోటుతో మృతి

    ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి కుప్పకూలిన భరత్ నగర్ కి చెందిన విజయ లక్ష్మి.. ఆస్పత్రికి తరలించిన పోలింగ్ సిబ్బంది, స్థానికులు.. గుండెపోటుతో మృతి చెందినట్టు నిర్ధారించిన డాక్టర్



  • May 13, 2024 14:31 IST

    అనంతపురం జిల్లాలో -1 గంటల సమయానికి పోలింగ్ శాతం

    ♦️రాయదుర్గం - 40.39%
    ♦️ఉరవకొండ - 44.3 %
    ♦️గుంతకల్లు - 38.38 %
    ♦️తాడిపత్రి - 40.01 %
    ♦️శింగణమల 32.62 %
    ♦️అనంతపురం అర్బన్ 42.27 %
    ♦️కళ్యాణదుర్గం - 27.57 %
    ♦️రాప్తాడు - 41.30 %
    ♦️అనంతపురం పార్లమెంట్ మొత్తం 37.93 %
    ♦️మొత్తం : 38.35 %



  • May 13, 2024 14:27 IST

    తమ్మినేని సతీమణిపై ఈసీకి దేవినేని ఉమా ఫిర్యాదు

    వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం సతిమణి వాణిశ్రీ ఆమదాలవలసలోని పోలింగ్‌ బూత్‌లో అక్రమాలకు పాల్పడినట్లు ఈసీకి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు లేఖ రాశారు.



  • May 13, 2024 14:23 IST

    వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై టీడీపీ కార్యకర్తల దాడి.. పరిస్థితి ఉద్రిక్తత



  • May 13, 2024 14:18 IST

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 గంట వరకు నమోదు అయినా పోలింగ్ శాతం..40.38

    • అదిలాబాద్ -50.18
    • భువనగిరి -46.49
    • చేవెళ్ల -34.56
    • హైదరాబాద్ -19.37
    • కరీంనగర్-45.11
    • ఖమ్మం-50.63
    • మహబూబాబాద్-48.81
    • మహబూబ్ నగర్ -45.84
    • మల్కాజ్ గిరి-27.69
    • మెదక్-46.72
    • నాగర్ కర్నూల్ -45.88
    • నల్గొండ-48.48
    • నిజామాబాద్-45.67
    • పెద్దపల్లి-44.87
    • సికింద్రబాద్-24.91
    • వరంగల్-41.23
    • జహీరాబాద్-50.71
    • సికింద్రబాద్
    • కంటోన్మెంట్..29.03



  • May 13, 2024 14:14 IST

    ఏపీలో మధ్యాహ్నం 1 గంట వరకు 40.26% పోలింగ్



  • May 13, 2024 14:12 IST

    విజయవాడలోని కమాండ్ సెంటర్ నుంచి పోలింగ్ పరిశీలిస్తున్న ఈసీ



  • May 13, 2024 14:11 IST

    అరకులో బారులుదీరిన ఓటర్లు



  • May 13, 2024 14:10 IST

    విజయవాడలో ఓటు వేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్



  • May 13, 2024 14:06 IST

    తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్ కుమారుడు హిమాన్షు



  • May 13, 2024 13:59 IST

    ఏపీలో ఇప్పటివరకు ఓటేసిన కోటిన్నర మంది ఓటర్లు



  • May 13, 2024 13:55 IST

    హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై ఎన్నికల సంఘం సీరియస్.. కేసు నమోదు చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు



  • May 13, 2024 13:27 IST

    సీఎం రేవంత్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు



  • May 13, 2024 13:09 IST

    వికారాబాద్ పట్టణం లోని సంగం లక్ష్మి బాయి పాఠశాలలో ఓటు వేసిన ఎస్పీ కోటిరెడ్డి



  • May 13, 2024 13:07 IST

    మొయినాబాద్ మండలం ఎనికేపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన రంజిత్ రెడ్డి



  • May 13, 2024 13:01 IST

    సత్యసాయి జిల్లాలో పోలింగ్‌ను బహిష్కరించిన ఓటర్లు..

    -- తమకు రోడ్లు వేయలేదని..తాగునీరు లేదని బహిష్కరణ
    -- ఓటింగ్‌ను బహిష్కరించిన హిందూపురం కిరికెర పంచాయితీలోని..
    -- కే బసవనపల్లి ఇందిరమ్మ కాలనీ ప్రజలు
    -- మరోవైపు చిలమత్తూరు మండలం వీరాపురంలో ఉద్రిక్తత
    -- హుస్సేన్ పురంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ



  • May 13, 2024 13:00 IST

    ఎన్నికల సిబ్బందితో నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అర్వింద్ ఆందోళన



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు