AP Assembly Elections Counting: కౌంటింగ్ కు అంతా సిద్ధం.. తొలి ఫలితం వచ్చేది అప్పుడే.. ఏపీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. తొలిఫలితం మధ్యాహ్నం 1 గంటకు వచ్చే అవకాశం ఉంది. చివరి ఫలితం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రావచ్చు. కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్ల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 04 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి AP Assembly Elections Counting: నువ్వా నేనా.. కాదు.. కాదు.. మేమా.. నువ్వా తేలిపోవాల్సిందే అంటూ సాగిన ఏపీ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లో రాబోతున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ లో విజేతలు ఎవరో తేలిపోతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది.లోక్ సభ స్థానాలకు పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం లకు వేర్వేరు హాల్స్ లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అసెంబ్లీ స్థానాలకు ఒకే హాలులో రెండిటి కౌంటింగ్ జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు 8 గంటలకు మొదలవుతుంది. 8:30 కు ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. తరువాత రెండూ సమాంతరంగా జరుగుతాయి. పోస్టల్ ఓట్ల లెక్కింపు రౌండ్ కు దాదాపు 2:30 గంటలు పడుతుంది. అదే ఈవీఎం ఓట్ల కౌంటింగ్ కు సుమారు 20-25 నిముషాలు పడుతుంది. AP Assembly Elections Counting: ఏపీ అసెంబ్లీకి సంబంధించి కొవ్వూరు, నరసాపురం నియోజకవర్గాల ఫలితాలు ముందుగా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 13 రౌండ్లలోనే ఫలితం తేలిపోతుంది. అన్నిటికన్నా ఎక్కువ సమయం భీమిలి, పాణ్యం నియోజకవర్గాలకు పడుతుంది. ఇక్కడ 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటి ఫలితం కౌంటింగ్ ప్రారంభమైన 5 గంటల్లో కొవ్వూరు, నర్సాపురం నియోజకవర్గాల నుంచి వస్తుంది. చివరి ఫలితం రావడానికి 10 గంటల సమయం పడుతుంది. Also Read: గెలిచేదెవరు? బద్దలవబోతున్న నిశ్శబ్దం..కౌంటింగ్ లైవ్ అప్ డేట్స్! ఇక ఏపీ లోక్ సభ స్థానాల ఫలితాల విషయానికి వస్తే.. రాజమహేంద్రవరం, నరసాపురం నియోజకవర్గాల్లో ఫలితం 13 రౌండ్లలో దాదాపుగా 5 గంటల్లో వచ్చేస్తుంది. అలాగే, అమలాపురం నియోజకవర్గం నుంచి ఆలస్యంగా ఫలితం వెల్లడి అవుతుంది. దాదాపు 10 గంటల సమయం కౌంటింగ్ జరుగుతుంది. విస్తృత ఏర్పాట్లు.. AP Assembly Elections Counting: కౌంటింగ్ ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,985 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి 12 వేల మందిని బైండోవర్ చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం 25వేల మంది సిబ్బంది.. 45 వేల మంది పోలీసులు పనిచేస్తారు. ఇక భద్రత కోసం 25 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. మూతం రాష్ట్రంలో 67 కంపెనీల కేంద్రబలగాలు సిద్ధంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో వదంతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే కఠిన చర్యలు తీసుకోనున్నారు. #2024-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి