AP Assembly Election Results: ఆ జిల్లా ప్రజలు జై కొడితే చాలు.. సీఎం కుర్చీ దక్కినట్టే!

ఎన్నికల విషయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తీర్పు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారాన్ని సాధిస్తుంది అనే దాన్ని తేల్చేస్తుంది. 2004 నుంచి ఇక్కడ అధికంగా సీట్లు సాధించిన పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటోంది. అదెలానో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

New Update
AP Assembly Election Results: ఆ జిల్లా ప్రజలు జై కొడితే చాలు.. సీఎం కుర్చీ దక్కినట్టే!

AP Assembly Election Results: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో నువ్వా.. నేనా అంటూ సాగిన ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే, ఏపీ ప్రజలతో పాటు.. రాజకీయ విశ్లేషకులు.. నాయకులు.. అందరి ద్రుష్టి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపైనే ఉంది. ఎందుకంటే, 2004 నుంచి 2019 వరకూ అక్కడ ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటూ వస్తోంది. ఈ లెక్కలు చూడండి.. 

  • 2004 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 16 స్థానాలకు కాంగ్రెస్ 12 చోట్ల విజయం సాధించింది. టీడీపీ 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది. 
  • 2009లో ఇక్కడ 15 స్థానాల్లో 9 చోట్ల కాంగ్రెస్, 5 స్థానాల్లో టీడీపీ, ఒక సీటు ప్రజారాజ్యం గెలుచుకున్నాయి. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 
  • 2014లో మొత్తం 15 స్థానాల్లోనూ టీడీపీ స్వీప్ చేసింది. దీంతో రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించుకుంది. 
  • 2019లో 15 స్థానాల్లో 13 చోట్ల వైసీపీ జయకేతనం ఎగురవేసింది. 2 చోట్ల టీడీపీ గెలిచింది. వైసీపీ అధికార పగ్గాలు చేపట్టింది. 

Also Read: కడప గడపలో గెలుపెవరిది? షర్మిల కాంగ్రెస్ కు విజయాన్ని తెస్తారా?

AP Assembly Election Results: ఇలా నాలుగు సార్లు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఎవరికి జైకొడితే వారే రాష్ట్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం జరుగుతూ వస్తోంది. అందుకే, ఈసారి కూడా ప్రచారంలో ఈ జిల్లాలో అన్ని పార్టీలు గట్టిగా తమ ప్రయత్నాలు చేశాయి. మరి ఓటర్లు ఏ పార్టీని నెత్తిన పెట్టుకున్నారు అనేది మరి కొద్దిగంటల్లో తేలనుంది. 

Advertisment
తాజా కథనాలు