Chandrababu Case Updates: చంద్రబాబు బెయిల్, కస్టడి పిటిషన్లపై విచారణ వాయిదా.. మరికొన్ని రోజులు జైలులోనే?

చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. సుప్రీంకోర్టులోనూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ రోజుకు విచారణకు రాలేదు. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

New Update
Chandrababu Case Updates: చంద్రబాబు బెయిల్, కస్టడి పిటిషన్లపై విచారణ వాయిదా.. మరికొన్ని రోజులు జైలులోనే?

చంద్రబాబు (Chandrababu Naidu) కస్టడీ, బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్ పై చంద్రబాబు తరఫు న్యాయవాదులు దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ కౌంటర్లు దాఖలు చేశారు. అనంతరం విచారణ ను న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. ఏసీబీ కోర్టు జడ్జి ఈ రోజు సెలవుపై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు విచారణ చేపట్టిన ఇన్‌చార్జి న్యాయమూర్తి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే.. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టును కొట్టి వేయడాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) ను అత్యవసరంగా విచారించాలని చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా నిన్న సీజేఐ చంద్రచూడ్ వద్ద ప్రస్తావించారు. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగాల్సి ఉండగా.. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ రోజు భేటీ కానున్న నేపథ్యంలో మిగతా కేసులను ఈ రోజు రిజిస్ట్రీ ఇవాళ లిస్ట్ చేయలేదు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ రేపు విచారణకు రాకుంటే.. విచారణ కోసం అక్టోబర్ 2వ తేదీ వరకు ఆగే అవకాశం ఉంటుంది. ఎల్లుండి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు హాలీడేస్ ఉండడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో రేపు ఈ కేసు విచారణకు వచ్చేలా చంద్రబాబు తరఫు లాయర్లు సీఐజేను ప్రత్యేకంగా కలిసి కోరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరగకపోతే అక్టోబర్ 3వ తేదీ వరకూ ఎదురుచూడక తప్పదు. దీంతో చంద్రబాబు లాయర్లు సీజేఐని కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేందుకు సిద్దమవుతున్నారు.

Advertisment
తాజా కథనాలు